మరో సినిమా అనౌన్స్ చేసిన స్టార్ డైరెక్టర్!

ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. యష్ లాంటి మీడియం రేంజ్ హీరోని పెట్టి ఆయన తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ సినిమా రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో హీరో యష్ రేంజ్ పెరిగిపోయింది. ప్రశాంత్ నీల్ తెరపై యష్ ని ప్రజంట్ చేసిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హీరో ఎలివేషన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా తరువాత ప్రశాంత్ తో కలిసి పని చేయడానికి చాలా మంది సూపర్ స్టార్లు ఆసక్తి చూపించారు.

ప్రస్తుతం ఈ డైరెక్టర్ ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని రూపొందించే పనిలో పడ్డారు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా ‘సలార్’ అనే సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ప్రశాంత్ మరో సినిమా అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమాకి ఆయన స్క్రిప్ట్ మాత్రమే అందిస్తున్నాడు. దర్శకత్వ బాధ్యతలను డీఆర్ సూరి అనే వ్యక్తికి అప్పగించారు. ‘కేజీఎఫ్’తో పాటు ‘సలార్’ సినిమాను నిర్మిస్తున్న హోంబలే ఫిలిమ్స్ తోనే ఈ సినిమాను కూడా చేయబోతున్నాడు ప్రశాంత్.

ఈ సినిమాకి ‘భగీర’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో శ్రీ మురళి హీరోగా నటించనున్నారు. గతంలో శ్రీమురళి హీరోగా ప్రశాంత్ ‘ఉగ్రం’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ అందుకుంది. ఇప్పుడు మరోసారి అతడితో కలిసి పని చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ ని డిజైన్ చేసి రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.


Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus