రీజన్స్ ఏంటో ముందే చెప్పిన నటి..!

  • January 25, 2021 / 06:24 PM IST

కిచ్చ సుదీప్ హోస్ట్ గా ఉన్న కన్నడ బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసిన జయశ్రీ రామయ్య ఆత్మహత్య చేసుకోవడంతో కన్నడ ఇండస్ట్రీలో తీవ్రవిషాదం నెలకొంది. ఆదివారం నైట్ బెంగుళూర్ లో తన ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలని విడిచిపెట్టింది. నిజానికి ఆమె మానసికస్థితి సరిగ్గా ఉండట్లేదని జులై లోనే తన అభిమానులతో ఇన్ స్ట్రా, ఫేస్ బుక్ లైవ్ ద్వారా వెల్లడించింది. జీవితంలో ఎంతో పోరాడాను అని, అలిసిపోయాను అని , ఓడిపోయాను అంటూ చెప్పుకొచ్చింది.

జులై 22వ తేదిన డిప్రెషన్ లో ఉన్నట్లుగా పోస్ట్ పెట్టి తర్వాత డిలీట్ కూడా చేసింది. ఆ తర్వాత కిచ్చ సుదీప్ జయశ్రీకి ధైర్యం చెప్పాడంటూ వార్తలు కూడా హల్ చల్ చేశాయి. కానీ, ఆ తర్వాత లైవ్ లో తన ఫ్యాన్స్ తో మాట్లాడిన జయశ్రీ తను చాలా డిప్రెషన్ లో ఉన్నాను అని, చిన్నప్పటి నుంచీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాను అని చెప్పింది. ఆర్ధికంగా బాగానే ఉన్నా, చిన్నప్పటి నుంచి నన్ను ఎన్నో వ్యక్తిగత సమస్యలు వెంటాడుతున్నాయి.

వాటిని ఎదుర్కోలేకపోతున్నాను, శక్తి కూడా సరిపోవట్లేదు, సమస్యల వలలో చిక్కుకున్న నేను వాటిని అధిగమించలేకపోతున్నాను అంటూ అబిమానులతో తన మనసులో ఉన్న బాధనంతా కూడా వెళ్లగక్కింది. ఇలా మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యి జనవరి 24వ తేదిన ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె ఆత్మకి శాంతి కలగాలంటూ పలువురు కన్నడ ఇండస్ట్రీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus