రిషబ్ శెట్టి (Rishab Shetty),రుక్మిణీ వసంత్ హీరో, హీరోయిన్లుగా రూపొందిన పీరియాడిక్ అండ్ డివోషనల్, ఫాంటసీ మూవీ ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1). దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దానికి తోడు ‘కాంతార’ హైప్ కూడా ఉండటంతో ‘కాంతార చాప్టర్ 1’ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తర్వాత కూడా బాగానే నిలబడింది.
ఇప్పటికీ స్టడీగా రాణిస్తుంది. కానీ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడంలో తేలిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం లేదు. కానీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది.
ఒకసారి ‘కాంతార చాప్టర్ 1’ 3 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 30.14 cr |
సీడెడ్ | 9.37 cr |
ఉత్తరాంధ్ర | 8.66 cr |
ఈస్ట్ | 3.66 cr |
వెస్ట్ | 2.71 cr |
గుంటూరు | 3.91 cr |
కృష్ణా | 3.97 cr |
నెల్లూరు | 2.06 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 64.48 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.59 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 66.07 కోట్లు(షేర్) (తెలుగు వెర్షన్) |
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) చిత్రం తెలుగు వెర్షన్ కి ఏకంగా రూ.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.86 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 వారాల్లో ‘కాంతార చాప్టర్ 1’ చిత్రం రూ.66.07 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.117.10 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.19.93 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ రీచ్ అవ్వడం అయితే కష్టమే కానీ.. ఇప్పటికీ ఈ సినిమా డీసెంట్ షేర్స్ ను రాబడుతుండటం విశేషంగా చెప్పుకోవాలి.