Kantara: Chapter 1 First Review: కన్నడ ఇండస్ట్రీకి మరో రూ.1000 కోట్లు అందిస్తుందా?

కన్నడ స్టార్ హీరో, దర్శకుడు అయినటువంటి రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ‘కాంతార’ (Kantara) రూపొందింది. 2022 సెప్టెంబర్ 30న కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో అక్టోబర్ 15న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం వంటి భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. అంత లేట్ గా రిలీజ్ చేస్తే.. ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా డబ్బింగ్ సినిమాలు వారం రోజులకు మించి ఆడవు.

Kantara: Chapter 1 First Review

అలాంటిది ‘కాంతార’ మాత్రం మిగిలిన భాషల్లో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని విజయం సాధించింది. లాంగ్ రన్ పడింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ లో తీసిన ‘కాంతార’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.380 కోట్లు వసూలు చేసి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.టెక్నికల్ గా ‘కాంతార’ ఎక్కడా కూడా రూ.16 కోట్ల బడ్జెట్ సినిమాలా అనిపించదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ, ఫస్ట్ హాఫ్ లో వచ్చే హర్రర్ ఎలిమెంట్స్ కానీ, క్లైమాక్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి ఇచ్చిన లీడ్ కూడా క్యూరియాసిటీ పెంచుతుంది. ఇక రెండో భాగం ప్రీక్వెల్ గా ‘కాంతార చాప్టర్ 1’ పేరుతో రూపొందించారు.

అక్టోబర్ 2న రిలీజ్ కానుంది ఈ సినిమా. ట్రైలర్ బాగానే ఉంది కానీ ‘కాంతార’ అభిమానులను ఒకింత డిజప్పాయింట్ చేసింది అనే చెప్పాలి. ఎందుకంటే.. ‘కాంతార’ లో ఏ ఎలిమెంట్స్ అయితే ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయో.. అవి ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్లో కనిపించలేదు. అయినప్పటికీ కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో అక్టోబర్ 1నే ప్రీమియర్ షోలు వేసేందుకు ‘కాంతార చాప్టర్ 1’ టీం డిసైడ్ అయ్యింది. తెలుగులో ‘కాంతార చాప్టర్ 1’ ని ‘మైత్రి డిస్ట్రిబ్యూషన్’ సంస్థ రిలీజ్ చేస్తుంది. ఆల్రెడీ టాలీవుడ్లో ఉన్న కొంతమంది పెద్దలు ‘కాంతార చాప్టర్ 1’ చూడటం జరిగింది.

సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ‘కాంతార చాప్టర్ 1’ చాలా గ్రాండ్ గా ఉందని, మొదటి భాగంలో క్రియేట్ చేసిన ప్రశ్నలన్నిటికీ 2వ భాగంలో బాగా క్లారిటీ ఇచ్చారని…! ఇది మరింత గ్రాండియర్ గా ఉంది అని ప్రశంసించారు. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్ లో ఉన్నాయట. రుక్మిణీ వసంత్ గ్లామర్.. రిషబ్ శెట్టి ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ కూడా అలరిస్తాయని తెలిపారు. మరి ప్రీమియర్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ఆమె వల్లే ఇదంతా.. తన లక్కీ ఛార్మ్‌ గురించి అజిత్‌ ఆసక్తికర కబుర్లు

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus