Ajith: ఆమె వల్లే ఇదంతా.. తన లక్కీ ఛార్మ్‌ గురించి అజిత్‌ ఆసక్తికర కబుర్లు

సినిమా హీరోలు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు చాలాసార్లు ఎదురయ్యే ప్రశ్న ‘సినిమాలు.. కుటుంబాన్ని ఎలా మేనేజ్‌ చేస్తున్నారు’ అని. ఎందుకంటే రెండూ ఒకేసారి మేనేజ్‌ చేయడం అంత ఈజీ కాదు. అలాంటిది ఓవైపు సినిమా హీరోగా.. మరోవైపు రేసర్‌గా ఒకేసారి రెండు కెరీర్‌లను రన్‌ చేస్తున్నారు అజిత్‌. మరి అతను ఎలా హ్యాండిల్‌ చేస్తున్నారు అనేది ఆసక్తికరమైన విషయమే. ఇదే విషయం అజిత్‌ కుమార్‌ దగ్గర ప్రస్తావిస్తే.. ఎప్పటిలా తన భార్య షాలినిపై అజిత్‌ ప్రేమను చాటేలా మాట్లాడారు.

Ajith

తాను సాధించిన విజయాల వెనుక షాలిని ప్రోత్సహం ఉందంటూ మరోమారు ప్రశంసలు కురిపించారు. పర్సనల్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను ఆమె కారణంగానే బాగా బ్యాలెన్స్‌ చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. షాలిని చాలా పనులు చక్కబెడుతుందని, తన మద్దతు లేకపోతే నేను ఇదంతా చేసేవాడిని కాదు అని క్లారిటీ ఇచ్చేశారు. తమకు 2002లో పెళ్లి అయిన వెంటనే రేసింగ్‌కు తిరిగొచ్చానని గుర్తు చేసుకున్నాడు అజిల్‌. ఆ సమయంలోనే షాలిని కూడా అజిత్‌తోపాటు రేస్‌ కోర్టుకు వచ్చేదట. అయితే పిల్లలు పుట్టాక బిజీ అయిపోయిందని చెప్పాడు.

ఇక తమ కొడుకుకీ రేసింగ్‌ ఇష్టమని.. ప్రస్తుతం గో- కార్టింగ్‌ ప్రారంభించాడని చెప్పాడు అజిత్‌. మరి రేసింగ్‌ను కొనసాగిస్తాడో, లేదో? అనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పాడు. పిల్లలు తమంతట తామే నచ్చిన రంగంలోకి అడుగుపెట్టాలనేది తన ఆలోచన అని.. చెప్పాడు అజిత్‌. వృత్తుల కసం తాను ఎక్కడెక్కడికో వెళుతుంటానని.. ఆ సమయంలో పిల్లలను మిస్‌ అవుతుంటానని సగటు తండ్రిలా మాట్లాడాడు అజిత్‌.

ఇక అజిత్‌ ఇటు నటన, అటు ప్రొఫెషనల్‌ రేసింగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో జరిగిన దుబాయ్‌ కారు రేసింగ్‌లో అజిత్‌ టీమ్‌ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటలీలో జరిగిన రేస్‌లో మూడో స్థానంలో నిలిచారు. ఇక ఈ సంవత్సరం ‘పట్టుదల’, ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమాలతో వచ్చాడు.

స్టేషన్‌లో పడక.. ప్రసాదమే భోజనం.. ‘మిరాయ్‌’ మ్యూజిక్‌ డైరక్టర్‌ లైఫ్‌ ఇదీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags