Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా చేసిన ‘కాంతార’ చిత్రం 2022 చివర్లో విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. 2 వారాల తర్వాత తెలుగులో ఆ సినిమా రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపింది ఆ సినిమా. దీంతో ఈ సినిమాకి ప్రీక్వెల్ గా రూపొందిన ‘కాంతార చాప్టర్ 1’ పై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ 2న అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

Kantara Chapter 1  Collections

సినిమాకి సో సో టాక్ మాత్రమే వచ్చింది. మొదటి భాగంతో పోలిస్తే.. ఈ 2వ భాగం పెద్దగా లేదు అనే కంప్లైంట్ ఉంది. కానీ కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయని ప్రశంసలు దక్కాయి. సీక్వెల్ కి ఈ మాత్రం టాక్ వస్తే చాలు తిరుగుండదు అని ‘కాంతార చాప్టర్ 1’ మరోసారి చాటి చెప్పినట్టు అయ్యింది. ముందుగా ఊహించినట్టుగానే తొలిరోజు ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తే.. ‘కాంతార చాప్టర్ 1’ సినిమాకి టికెట్లు భారీగా బుక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.80 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ వంటి లెక్కలు ఇంకాస్త పెరిగితే కచ్చితంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ దాటే అవకాశాలు కూడా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ‘కాంతార చాప్టర్ 1’ రూ.25 కోట్లు కొల్లగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus