Karan Johar, Vijay Devarakonda: విజయ్ తో కరణ్ జోహార్ మరో సినిమా చేస్తారట!

టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ లాంటి హిట్స్ అతడి ఖాతాలో ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో అతడు నటించిన సినిమాలేవీ వర్కవుట్ కావడం లేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్’ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కూడా చాలా పోగొట్టుకున్నారట. సినిమా రిలీజ్ తరువాత రెమ్యునరేషన్ తీసుకుందామని కేవలం అడ్వాన్స్ మాత్రమే తీసుకున్నారట విజయ్.

ఇప్పుడు సినిమా పోవడంతో విజయ్ కి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వడం లేదట. విజయ్ తో పూరి చేయాలనుకున్న ‘జనగణమన’ సినిమా కూడా ఆగిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. పూరి మాత్రం ఈ ప్రాజెక్ట్ వదిలే ఛాన్స్ లేదని.. బాలీవుడ్ హీరోలను సెట్ చేసే పనిలో ఉన్నారని టాక్. ఇదిలా ఉండగా.. ‘లైగర్’ సినిమాను హిందీ ప్రెజంట్ చేసి కాస్త హడావిడి చేసిన కరణ్ జోహార్ మరోసారి విజయ్ తో సినిమా చేయాలనుకుంటున్నారట.

విజయ్ ని తాను సరిగ్గా లాంచ్ చేయలేకపోయానని భావించిన కరణ్ ఇప్పుడు అతడికి మంచి ప్రాజెక్ట్ సెట్ చేయాలని చూస్తున్నారు. విజయ్ ని లవర్ బాయ్ గా బాలీవుడ్ లో ప్రెజంట్ చేద్దామని కరణ్ జోహార్ భావిస్తున్నారట. ప్రస్తుతమైతే విజయ్ తెలుగులో ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా కనిపించనుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇది కాకుండా విజయ్ చేతిలో మరో సినిమా లేదు. కరణ్ జోహార్ ప్రాజెక్ట్ సెట్ అయితే మాత్రం ‘ఖుషి’ తరువాత మరో బాలీవుడ్ సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా.. ‘జెర్సీ’ డైరెక్టర్ విజయ్ తో సినిమా చేయాలని భావిస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus