Karate Kalyani: రెండో పెళ్లి ఆలోచనలలో కరాటే కళ్యాణి… రెండో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్!

కరాటే కళ్యాణి పరిచయం అవసరం లేని పేరు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి ఈమె బయట మాత్రం పలు వివాదాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇలా పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కరాటే కళ్యాణి తరచు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో ఉంటారు. తాజాగా యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో ఈమెకు జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే.
ఈ విధంగా ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాల గురించి కూడా కరాటే కళ్యాణి మాట్లాడుతూ వివాదాలకు కూడా కారణం అవుతూ ఉంటారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కరాటే కళ్యాణి తన గురించి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ చాలా మంది నేను అందరితో గొడవ పెట్టుకుంటానని అనుకుంటారు. కానీ నాణెంకు మరొకవైపు కూడా చూడాలని ఈమె చెప్పారు. వ్యక్తిగతంగా నేను చాలా మంచిదాన్ని నలుగురికి సహాయం చేసే గుణం నాకి ఉందని ఈమె గురించి ఈమె చెప్పుకున్నారు.ఇక ఇండస్ట్రీలో చాలామంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు

నాకు మాత్రం అలాంటి ఇబ్బందులు రాలేదని ఎందుకంటే నాకు కరాటే రావడమే అందుకు కారణమని తెలిపారు.ఇలా సినిమాల గురించి పలు విషయాలు చెప్పినటువంటి ఈమె తన వ్యక్తిగత జీవితం గురించి కూడా తెలియజేశారు. తనకు వివాహం అయినప్పటికీ తన భర్త మాత్రం తనని చాలా చిత్రహింసలు పెట్టారని నిత్యం తాగొచ్చు తనతో గొడవ పడడమే కాకుండా తనని నడిరోడ్డుపై బాగా కొట్టేవారని ఈమె తెలిపారు. ఒకరోజు తాగి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే నా బట్టలు లాగారని ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

నాకు కరాటే వచ్చిన తనపై చేయి చేసుకోక పోవడానికి గల కారణం భర్త అన్న గౌరవం మాత్రమేనని అయితే అతని పెట్టే టార్చర్ భరించలేక అతని నుంచి విడిపోయానని తెలిపారు.అయితే ఇప్పటికి తన తల్లి జీవితంలో ఒక తోడు అవసరం పెళ్లి చేసుకోమని తన పై ఒత్తిడి తెస్తుందని, నేను కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నాను. ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి అంటూ ఈ సందర్భంగా ఈమె రెండో పెళ్లి గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus