Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 31, 2026 / 06:16 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సముద్రఖని (Hero)
  • సమైరా శ్రీ (Heroine)
  • ఆనంద్, అభిరామి, శరణ్య ప్రదీప్,ధనరాజ్, గడ్డం నవీన్, మధునందన్ తదితరులు (Cast)
  • అభినయ కృష్ణ (Director)
  • వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ (Producer)
  • గ్యాని (Music)
  • ఈశ్వర్ పెంటి (Cinematography)
  • శ్రీ వరప్రసాద్ (Editor)
  • Release Date : 31st జూలై 2026
  • మై ఫిలిం ప్రొడక్షన్స్ (Banner)

‘జబర్దస్త్’ కమెడియన్స్ లో సూపర్ టాలెంట్ కూడా ఉంది’ అని ‘బలగం’ తో ప్రూవ్ చేశాడు వేణు. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ధనరాజ్ కూడా దర్శకుడిగా మారి ‘రామం రాఘవం’ అనే సినిమా చేశాడు. దానికి కూడా క్రిటిక్స్ నుండీ మంచి అప్రీషియేషన్ లభించింది. వీరి బాటలోనే అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ కూడా దర్శకుడిగా మారి ‘చిరంజీవ’ అనే సినిమా చేశాడు. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాని జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ‘కర్మాఖ్య’ అనే థియేట్రికల్ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

‘ఇదొక థ్రిల్లర్’ అంటూ ప్రచారం చేసుకున్నాడు. మొదట ఈ సినిమాకి ‘కామాఖ్య’ అనే టైటిల్ పెట్టారు. కానీ సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు తెలుపడంతో ‘కర్మాఖ్య’ గా మార్చారు. విజయశాంతి వంటి స్టార్స్ వచ్చి ఈ సినిమాని ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :

Karmakhya Movie Review

Karmakhya Movie Review And Rating

కథ: ప్రవల్లిక(శరణ్య ప్రదీప్) కామాఖ్య(సమైరా) హాస్టల్మేట్స్. అలాగే ఫ్రెండ్స్ కూడా..! ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటారు. అయితే ఒక టైంలో కామాఖ్య జాబ్ పోతుంది. అందువల్ల ఆమె తాను బ్యాంక్లో తీసుకున్న లోన్ కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉంటుంది. సరిగ్గా అలాంటి టైంలో ప్రవల్లిక .. కామాఖ్యకి కొంత ఆర్ధిక సాయం చేస్తుంది. తర్వాత అనుకోకుండా ప్రవల్లిక ఒక ఫంక్షన్ కి హాజరు కావాల్సి వస్తుంది. అందువల్ల ఆమె విధులకి వెళ్లలేని పరిస్థితి. విషయం తెలుసుకున్న తర్వాత కామాఖ్య .. ప్రవల్లికకి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతుంది.

ఇందులో భాగంగా.. నగరం శివార్లలో ఉన్న నవోదయ కాలనీలో ఉన్న ప్రజ్ఞ కుటుంబ సభ్యులైన సరోజిని(అభిరామి) ప్రభాకర్ (ఆనంద్) దంపతులకి రూ.25 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ అందజేసి వివరాలు కలెక్ట్ చేసుకోవాలి. ఈ పనిపై వాళ్ళ ఇంటికి వెళ్ళిన కామాఖ్యకి ఊహించని షాక్ ఇస్తారు సరోజిని, ప్రభాకర్. అదేంటి? వాళ్ళ వల్ల కామాఖ్యకి వచ్చిన సమస్యలు ఏంటి? మధ్యలో తిరుపతి(సముద్రఖని) ఎవరు? వంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా అని చెప్పాలి.

Karmakhya Movie Review And Rating

నటీనటుల పనితీరు: కథ మొత్తం తిరిగేది సమైరా పాత్ర చుట్టూనే. చాలా వెయిటేజీ ఉన్న పాత్ర ఇది. కానీ ఎందుకో ఆమె మిస్ మ్యాచ్ అనిపించింది. సమైరా బదులు వేరే ఫెమిలియర్ ఆర్టిస్ట్ ను పెట్టుకోవాల్సింది. తిరుపతి అనే కమర్షియల్ పోలీస్ పాత్రలో సముద్రఖని బాగా చేశాడు. అతని క్యారెక్టరైజేషన్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు కామెడీ పండిస్తాయి. అభిరామి, శరణ్య ప్రదీప్.. లకి మంచి పాత్రలు పడ్డాయి.
వీరి పాత్రలు ఆడియన్స్ ను కూడా ఒకింత షాక్..కి గురిచేస్తాయి అని చెప్పాలి.

నెవెర్ బిఫోర్ అనే విధంగా వాళ్ళు పెర్ఫార్మ్ చేసి.. తమ పాత్రలకి న్యాయం చేశారు. సీనియర్ నటుడు ఆనంద్ కి కూడా మంచి పాత్ర దొరికింది. ధనరాజ్, గడ్డం నవీన్, జోష్ రవి, అదిరే అభి(దర్శకుడు) వంటి జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా అక్కడక్కడ కనిపించారు. కానీ కామెడీ అయితే పండలేదు. మధునందన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అది పర్వాలేదు అనిపిస్తుంది.

Karmakhya Movie Review And Rating

విశ్లేషణ: ఈ సినిమాకి ‘కామాఖ్య’ అనేది యాప్ట్ టైటిల్. కానీ సెన్సార్ వాళ్ళ గురించి మార్చాల్సి వచ్చినప్పుడు .. దానికి రిలేటబుల్ టైటిల్ ఏదైనా ఆలోచించి పెట్టాల్సింది. ‘కర్మాఖ్య’ అనే టైటిల్ అస్సలు యాప్ట్ అవ్వలేదు. ఈ సినిమాకి ఫస్ట్ మైనస్ అంటే ఇదే అని చెప్పాలి. ఇక ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా మొదలైనప్పటికీ .. తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు సీరియల్ ను తలపిస్తాయి. ఎప్పుడైతే హీరోయిన్ వెళ్ళి.. అభిరామి ఇంట్లో చిక్కుకుందో.. అక్కడి వరకు ఆడియన్స్..కి ఎక్సైట్మెంట్ అనేది కలగదు.

ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. సెకండాఫ్ పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. అలాగే సెకండాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ కంటే బెటర్ గా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అలాగే క్లైమాక్స్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి. నిర్మాణ లోపాలు ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగున్నప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత ఎఫెక్టివ్ గా లేదు. థ్రిల్లర్ కథలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ బాగుంటేనే ఆడియన్ అలర్ట్ అయ్యి థియేటర్ లో కూర్చుంటాడు. ఆ ఇంపాక్ట్ ఇక్కడ మిస్ అయ్యింది.

Karmakhya Movie Review And Rating

విశ్లేషణ: ‘కర్మాఖ్య’ ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్ మాత్రం బెటర్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ట్విస్టులు అవి వర్కౌట్ అయ్యాయి. థియేటర్లలో ఏమో కానీ ఓటీటీ ఆడియన్స్ ను మెప్పించే అంశాలు ఇందులో ఉన్నాయి.

Karmakhya Movie Review And Rating

ఫోకస్ పాయింట్: ఓటీటీకి ఓకె.. థియేటర్..కి వీకే

రేటింగ్: 2.25/5

Rating

2.25
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinaya Krishna
  • #Abhirami
  • #Karmakhya Movie
  • #Samaira
  • #Samuthrakhani

Reviews

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

16 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

21 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

22 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

23 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

24 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

1 day ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

1 day ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version