మళ్ళీ లిప్ లాకులతో రెచ్చిపోయిన ‘ఆర్.ఎక్స్.100 హీరో

‘ఆర్.ఎక్స్. 100’ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘హిప్పీ’. తాజాగా ఈ చిత్ర టీజర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేసాడు. ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో దాన్ని పట్టుకున్నారు… అచ్చ తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరుగుబోతని అంటారు తెలుసా అని వెన్నెల కిశోర్ చెప్పే డైలాగ్ తో ‘హిప్పీ’ టీజర్ మొదలయ్యింది. టీజర్ మొత్తం బైక్ రేసింగ్,యాక్షన్ అండ్ రొమాన్స్ తో టీజర్ ను కట్ చేసారు. ప్లే బాయ్ గా కార్తికేయ నటన ఆకట్టుకునేలా కనిపిస్తుంది.

ఓ పక్క హీరో తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ బాక్సింగ్ చేస్తున్న సీన్లు… అలాగే బికినీలతో ఉన్న హీరోయిన్లకు లిప్ లాకులతో ఉండే సీన్లు కుర్రకారుని హీటెక్కించేలా ఉన్నాయి. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉండేలా అనిపిస్తున్నాయి. కార్తికేయకు కలిసొచ్చిన ‘ఆర్.ఎక్స్.100’ చిత్ర ఫార్మేట్ లోనే ఈ చిత్రం కూడా ఉండేలా ఉంది. మొత్తానికి ‘హిప్పీ’ టీజర్ ఓకే అనిపిస్తుంది. కలైపులి ఎస్.తను… ‘వి.క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా టి.ఎన్.కృష్ణ డైరెక్ట్ చేసాడు. నివాస్ కె ప్రసన్న సంగీతం అందించిన ఈ చిత్రంలో కార్తికేయకు జోడీగా సూర్య వాన్షి, జాజ్బా సింగ్ హీరోయిన్లుగా నటించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus