‘ఖైదీ’ 10 రోజుల కల్లెక్షన్స్ ..!

‘డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌’ బ్యానర్ పై ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌ , ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మించిన తాజాగా చిత్రం ‘ఖైదీ’. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్ట్ చేసాడు. కార్తీ గత చిత్రం ‘దేవ్’ డిజాస్టర్ అవ్వడంతో.. మొదట ఈ ‘ఖైదీ’ చిత్రం పై ఎటువంటి అంచనాలు లేవు. అసలు ఈ సినిమా వస్తున్నట్టు కూడా చాలా మందికి తెలీదు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ట్రైలర్ విడుదలయ్యాక కొంత మేర అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ అధినేత రాధామోహన్ రిలీజ్ చేసాడు.

ఇక మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడంతో.. ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడటం మొదలయ్యాయి. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ 4 కోట్లకు జరిగాయి. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం రెండో వీకెండ్ లో కూడా అదే దూకుడు కాబాబరుస్తుంది. ‘మీకు మాత్రమే చెప్తా’ ‘ఆవిరి’ వంటి సినిమాలు విడుదలైనప్పటికీ ‘ఖైదీ’ జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇక 10 రోజులు పూర్తయ్యేసరికి ‘ఖైదీ’ చిత్రం 5.1 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కార్తీ సినిమా హిట్టయ్యి చాలా కాలమే అయ్యింది. ‘ఖాకీ’ సినిమా యావేరేజ్ గా నిలువగా.. ‘చినబాబు’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇక ‘దేవ్’ అయితే పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇలాంటి టైం లో ‘ఖైదీ’ హిట్టయ్యి మళ్ళీ కార్తీ మార్కెట్ పెరగడంలో సహాయపడిందనే చెప్పాలి. ఫుల్ రన్ లో ‘ఖైదీ’ సినిమా 6 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం ఉందని ఉందని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus