‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రకాష్ , ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన తాజాగా చిత్రం ‘ఖైదీ’. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసాడు. కార్తీ గత చిత్రం ‘దేవ్’ డిజాస్టర్ అవ్వడంతో.. మొదట ‘ఖైదీ’ చిత్రం పై ఎటువంటి అంచనాలు లేవు. అసలు ఈ సినిమా వస్తున్నట్టు కూడా చాలా మందికి తెలీదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ అధినేత రాధామోహన్ రిలీజ్ చేసాడు.
మొదటి షో తోనే సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతూనే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం రెండో వారం పూర్తయినా అదే దూకుడు చూపిస్తుండడం విశేషం. ‘మీకు మాత్రమే చెప్తా’ వంటి డీసెంట్ హిట్ సినిమా వచ్చినా.. డబ్బింగ్ సినిమా అయిన ‘ఖైదీ’ జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇక 14 రోజులు పూర్తయ్యేసరికి ‘ఖైదీ’ చిత్రం 5.7 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. మూడో వారంలో కూడా ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి 6 కోట్ల షేర్ వచ్చే ఛాన్స్ లు కూడా ఉన్నాయని ట్రేడ్ పండితులు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. మరి వారి నమ్మకం ఎంత నిజమైందో చూడాలి..!