‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రకాష్ , ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన తాజాగా చిత్రం ‘ఖైదీ’. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసాడు. కార్తీ గత చిత్రం ‘దేవ్’ డిజాస్టర్ అవ్వడంతో.. మొదట ఈ ‘ఖైదీ’ చిత్రం పై ఎటువంటి అంచనాలు లేవు. అసలు ఈ సినిమా వస్తున్నట్టు కూడా చాలా మందికి తెలీదు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ట్రైలర్ విడుదలయ్యాక కొంత మేర అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ అధినేత రాధామోహన్ రిలీజ్ చేసాడు.
ఇక మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడంతో.. ఈవెనింగ్ షోస్ నుండీ హౌస్ ఫుల్స్ పడ్డాయి. రోజు రోజుకి ‘ఖైదీ’ చిత్రానికి ఆదరణ పెరుగుతూనే వస్తుందని చెప్పాలి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 6 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టి 2.52 కోట్ల షేర్ ను రాబట్టింది. 5 వ రోజు కూడా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ఈ చిత్రానికి తెలుగు థియేట్రికల్ రైట్స్ 4 కోట్లకు జరిగాయి. దీంతో ఈజీగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదంటున్నారు ట్రేడ్ పండితులు.