‘ఖైదీ’ మొదటి వారం కల్లెక్షన్స్ ..!

  • November 1, 2019 / 07:58 PM IST

‘డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌’ బ్యానర్ పై ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌ , ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మించిన తాజాగా చిత్రం ‘ఖైదీ’. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్ట్ చేసాడు. కార్తీ గత చిత్రం ‘దేవ్’ డిజాస్టర్ అవ్వడంతో.. మొదట ఈ ‘ఖైదీ’ చిత్రం పై ఎటువంటి అంచనాలు లేవు. అసలు ఈ సినిమా వస్తున్నట్టు కూడా చాలా మందికి తెలీదు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ట్రైలర్ విడుదలయ్యాక కొంత మేర అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ అధినేత రాధామోహన్ రిలీజ్ చేసాడు.

ఇక మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడంతో.. ఈవెనింగ్ షోస్ నుండీ హౌస్ ఫుల్స్ పడ్డాయి. రోజు రోజుకి ‘ఖైదీ’ చిత్రానికి ఆదరణ పెరుగుతూనే వస్తుందని చెప్పాలి. విడుదలయ్యి వారం రోజులు పూర్తయినా ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతుండడం విశేషం. ఇక ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి 4.3 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ 4 కోట్లకు జరిగాయి. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ చేరుకొని హిట్ లిస్ట్ లో చేరింది. ఈరోజు నుండీ ఈ చిత్రానికి మరిన్ని థియేటర్లు యాడ్ చేయబోతుండడం మరో విశేషం.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus