టాలీవుడ్ దారి తప్పుతుంది….అభిమానం శ్రుతి మించుతుంది…కట్టలు తెంచుకున్న ఆవేశం….సినిమా బిజినెస్ పై భారీ ప్రభావమే చూపిస్తుంది…నిజమే నిన్న డీజె…ఈరోజు కాటమ రాయుడు….ఎందుకు ఇలా జరుగుతుందో ఎవ్వరికీ అర్ధం కావడంలేదు….విషయం లోకి వెళితే….పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కల్యాణ్ కాటమ రాయుడు…ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది…అదే క్రమంలో సినిమా ట్రైలర్ సైతం రిలీజ్ అయ్యింది…ఇక ఈ ట్రైలర్ కు కేవలం 24 గంటలలో వేలాది సంఖ్యలో డిజ్ లైక్స్ రావడం ఈ మూవీని భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లకు టార్చర్ పెడుతోంది అని వార్తలు వస్తున్నాయి. అయితే బన్నీ ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ రిలీజైనపుడు పవన్ ఫ్యాన్స్ పనిగట్టుకుని డిజ్ లైక్స్ కొట్టిన నేపధ్యాన్ని రిపీట్ చేస్తూ ఇప్పుడు అదే పర్వం మళ్ళీ రిపీట్ అవ్వుతూ ఉండటంతో బయ్యర్లు తెగ మధన పడుతున్నట్లు టాక్. ఇక మన ఇండియాలోనే ఏ టీజర్ కూ లేని స్థాయిలో అతి వేగంగా ‘కాటమరాయుడు’ టీజర్ కు డిజ్ లైక్స్ పెరుగుతూ ఉండటం చాలామందిని కలవర పరుస్తోంది.
దీనితో ‘కాటమరాయుడు’ ట్రైలర్ కు డిజ్ లైక్స్ కొట్డడానికి పవన్ యాంటీ ఫ్యాన్స్ బాగానే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఒక పక్క లైక్ పేరుతున్న కొద్దీ…అదే క్రమంలో డిజ్ లైక్స్ కూడా పెగుతూ ఉండడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు…ఈ సినిమాకు దాదాపుగా డిజ్ లైక్స్ 45 వేల దాకా ఉండటం విశేషం…… అయితే యూ ట్యూబ్ లైక్స్ డిజ్ లైక్స్ తో సినిమాకు వచ్చే నష్టం ఎంత మాత్రం లేదు అని కోలీవుడ్ వాసులు చెబుతున్నారు…ఎందుకంటే…‘కాటమరాయుడు’ మూవీని కేవలం ఒక్క కొలీవుడ్ లోనే 1000 స్క్రీన్లకు తక్కువ కాకుండా రిలీజ్ చేస్తున్నారట…మరి తమిళంలో లోకల్ టాప్ స్టార్ల సినిమాలే 500 నుండి 800 స్క్రీన్లలో రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఒక తెలుగు హీరో సినిమాను ఇంత భారీ స్థాయిలో కోలీవుడ్ లో విడుదల చెయ్యడం పవన్ స్టామినా ఎంతో మరో సారి అర్ధం అవుతుంది…చూద్దాం మరి ఏం జరగ బోతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.