తమిళ నటుడు విశాల్ నటించిన తాజా చిత్రం “కథకళి”. తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం అక్కడ ఓ మోస్తరు విజయం సాధించింది. తెలుగులో ఫిబ్రవరిలోనే విడుదల కావాల్సి ఉండగా పలుమార్లు వాయిదా పడిన అనంతరం ఎట్టకేలకు మార్చి 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్ సరసన కేథరీన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న ఈ చిత్రం తెలుగువారిని ఏమేరకు అలరిస్తుందో చూద్దాం..!!
కథ: మలాకర్ రెడ్డి (విశాల్) ఓ మధ్య తరగతి యువకుడు. కాకినాడలో పెద్ద రౌడీ అయిన సాంబ శివుడు (మధు సింగనపల్లి)తో గొడవ కారణంగా అమెరికా వెళ్ళిపోతాడు. ఓ నాలుగేళ్లపాటు అక్కడే ఉండి.. తాను ప్రేమించిన మల్లీశ్వరి (కేథరీన్)ను పెళ్లాడడానికి తిరిగి కాకినాడకు వస్తాడు. ఇంకో నాలుగు రోజుల్లో పెళ్లి ఉంది అనగా.. తన శత్రువు సాంబశివుడు హత్య కేసులో ఇరుక్కోంటాడు. అసలు సాంబను హత్య చేసింది ఎవరు? సాంబ హత్యకు కమలాకర్ కు ఉన్న సంబంధం ఏమిటి? కమలాకర్ పెళ్లి సజావుగా జరిగిందా? లేదా? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయం!