Katrina Kaif: కత్రినా కైఫ్ బాడీ గార్డ్ జీతం ఎంతో తెలిస్తే మతిపోతోంది..!

మల్లీశ్వరి, అల్లరి పిడుగు లాంటి తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈమె తెలుగులో ఫస్ట్ సినిమాకే 75 లక్షల రూపాయల రేంజ్‌లో రెమ్యునరేషన్‌ అందుకుని వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైన కత్రినా కైఫ్ త్వరలో టైగర్ 3 సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు టైగర్ 3 సినిమాలో కత్రినా కైఫ్ హద్దులు దాటి గ్లామర్ షో చేసిందంటూ దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

డిసెంబర్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కు కూడా 48 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం. అంతేకాదు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా అతిథి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే 40 ఏళ్లు దాటిన ఈ క్యూటీ.. వయసు పైబడుతున్నా ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుతుంది. ఇదిలా ఉంటే, ఆమె బాడీగార్డ్ జీతం ఇప్పుడు వైరల్‌గా మారింది.

కత్రినా కైఫ్ (Katrina Kaif) బాడీ గార్డ్ పేరు దీపక్ సింగ్. అతడి జీతం ఏడాదికి కోటి రూపాయలు అని సమాచారం. ఏది ఏమైనా కత్రినా కైఫ్ తన బాడీగార్డ్ కోసం ఏడాదికి కోటి రూపాయలు ఖర్చు చేస్తోందంటే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్టార్ సెలబ్రిటీగా కొనసాగితే ప్రజల్లోకి రావాలి అంటే ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చి బాడీ గార్డును కూడా సమకూర్చుకోవాల్సిందేనన్న వ్యాఖ్యలు కొందరి నుంచి వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus