Prabhas: ‘సాహో’కి అవ్వలేదు ఈయన వల్లన అవుతుందా?

Advertisement

మన భీమవరం రాజు ప్రభాస్‌ కటౌట్‌కి సరిపడా హీరోయిన్లు ఎవరు అంటే.. వినిపించే పేర్లలో కత్రినా కైఫ్‌ ఒకటి. ఆమె టాలీవుడ్‌ రాదు కదా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మన రాజుగారు ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. చేసే సినిమా బాలీవుడ్డే కదా. కాబట్టి ఎవరైనా నటించే అవకాశం ఉంది. ఇప్పుడు కత్రినా బేబీ గురించి ఎందుకు చర్చ అనేగా… మన డార్లింగ్ సరసన కత్రినా కైఫ్‌ని నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట.

బాలీవుడ్‌ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమాలో నటిస్తాడని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఈ సినిమా ఉండొచ్చనే వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తాజా సమాచారం ఏంటంటే ఈ సినిమాలో కత్రినా కైఫ్‌ను తీసుకుంటే బాగుంటుందని టీమ్ భావిస్తోందట. దీని కోసం ఇప్పటికే ఆమెను సంప్రదించారని టాక్‌. ఎప్పట్లాగే దీనిపై కూడా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

‘సాహో’లోనే ప్రభాస్‌ పక్కన కత్రినాను తీసుకుందామని అనుకున్నారు. ఆల్‌మోస్ట్‌ ఓకే అయిపోయిందని కూడా అనుకున్నారు. కానీ ఆమె బదులు శ్రద్ధా కపూర్‌ నటించింది. అయితే ప్రభాస్‌ కటౌట్‌ పక్కన కత్రిన ఉంటే ఆ కిక్కే వేరు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ సినిమాతోనైనా ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ సెక్స్ట్‌ సినిమాలు చాలా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా సిరీస్‌ నెంబర్‌తో తెలియడం లేదు. అంటే ఎప్పుడు మొదలవుతుందో తెలియడం లేదు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus