Brahmamudi August 5th: కావ్యను పర్మనెంట్ డిజైనర్ గా అపాయింట్ చేసిన రాజ్.. భారీ కాంట్రాక్ట్ వదులుకున్న కృష్ణమూర్తి!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… కావ్య డిజైన్స్ నచ్చడంతో క్లైంట్స్ఆ కాంట్రాక్ట్ రాజ్ కంపెనీకి ఇస్తారు. దీంతో సంతోషపడిన రాజ్ వెంటనే శృతిని పిలిచి కళావతి పేరు మీదగా పర్మనెంట్ డిజైనర్ గా అప్పాయింట్ మెంట్ ఆర్డర్ సిద్ధం చేయమని చెబుతారు. దీంతో శృతి మేడం పేరు కళావతి కాదు కావ్య కద సార్ అని అనడంతో శృతివైపు రాజ్ సీరియస్ గా చూడటంతో సర్ కు ఇగో హర్ట్ అయిందని శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయం ఇంట్లో వారందరికీ చెప్పాలని రాజ్ అనుకుంటాడు.

మరోవైపు స్వప్న మాటలు విన్నటువంటి అపర్ణ కావ్య కోసం ఎదురుచూస్తూ కూర్చుంటుంది. అంతలోపు కావ్య తన పుట్టింటి నుంచి ఇంటికి వచ్చి తన గదికి వెళుతూ ఉండగా ఆగు అంటూ అపర్ణ గట్టిగా అరవడంతో ఇంట్లో వారందరూ కూడా బయటకు వస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నావు నీ పుట్టింటి నుంచేనా అని అడగడంతో అవునని కావ్య సమాధానం చెబుతుంది. అంటే ఇక్కడ డబ్బు మొత్తం దోచుకెళ్లి నీ పుట్టింటికి పెడుతున్నావా అంటూ అపర్ణ కావ్యను నానా మాటలు అంటుంది. అప్పటికి కావ్య ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేసిన వినదు అంతలోపే రుద్రాణి వచ్చి ఆ కనకం ఇక్కడున్నటువంటి డబ్బును దోచుకెళ్లడానికి వీళ్లిద్దరిని ఇంటి కోడలుగా చేసింది కొంచెమైనా సిగ్గుండాలిగా అంటూ తన తల్లిని తిట్టడంతో కావ్య సీరియస్ అవుతుంది.

ఇక ఆపుతారా మీరు ఏం జరిగిందో తెలియకుండా అలా ఎలా మాట్లాడుతారు నేను రాత్రి మేల్కొని డిజైన్స్ గీసి తన భర్తకు అమ్ముకున్నాను ఆయన ఇచ్చిన డబ్బులను తీసుకెళ్లి మా అమ్మ వాళ్లకు ఇచ్చాను. పెళ్లి జరిగితే తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకి లేకుండా పోతుందా అంటూ కావ్య కూడా మాటకు మాట సమాధానం చెబుతుంది. మరి ఈ పని నువ్వు ఇంట్లో పెద్దవారికి చెప్పి చేయొచ్చు కదా అమ్మ అని చిట్టి అనడంతో నేను ఆయనకు చెప్పే వెళ్లాను అని అనడంతో అందరూ షాక్ అవుతారు అయినప్పటికీ అపర్ణ మాత్రం నువ్వు ఏదో మాయమాటలు చెప్పి వాడిని నీ వైపు తిప్పుకొని ఉంటావు అంటూ మాట్లాడుతుంది.అయినా మీరు ఇలా మా ఆయన లేకుండా నన్ను ఈ విషయం గురించి నిలదీయడం సభ్యత కాదు అంటూ కావ్య అపర్ణ రుద్రాణిపై ఫైర్ అవుతూ తన గదికి వెళ్ళిపోతుంది.

మరోవైపు కృష్ణమూర్తికి ఏకంగా 100 వినాయకుడి విగ్రహాలు చేయాలని పెద్ద కాంట్రాక్టు వస్తుంది. ఆ కాంట్రాక్ట్ ఇచ్చే ఆయన కావ్య ఉందా అని అడగడంతో కావ్య పెళ్లయి అత్తగారింటికి వెళ్లిపోయిందని చెబుతాడు. కావ్య ఉంటే ఈ కాంట్రాక్ట్ మీకే ఇస్తాను వస్తుందేమో అడగండి అని చెబుతాడు. దాంతో కృష్ణమూర్తి తను వస్తానని చెప్పిన నేను రానివ్వను మాకు ఈ కాంట్రాక్ట్ అవసరం లేదని చెప్పి పంపిస్తాడు. ఈ విధంగా కాంట్రాక్ట్ వదులుకోవడంతో ఈ కాంట్రాక్ట్ ఒప్పుకొని ఉంటే మన అప్పు తీరిపోయేది కదా అని కనకం మాట్లాడుతుంది.

ఒప్పుకుంటే అప్పు తీరిపోయేది అయినా ఈ ఇంటి అప్పు కావ్య కడతానని ఒప్పుకుంది. కానీ ఈ కాంట్రాక్ట్ నేను తీసుకొని తనని పిలిస్తే ఇక్కడికి తప్పకుండా వస్తుంది కానీ అత్తగారింట్లో తన కాపురంలో చిచ్చు కలుగుతుంది అంటూ కృష్ణమూర్తి మాట్లాడుతారు. మరోవైపు అభిమాని తనకు రాసిన లేక తీసుకువెళ్లి అప్పుకి చూపిస్తాడు కళ్యాణ్.నా కవితలకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు అన్నావు చూడు అభిమానులు ఎలా లెటర్స్ రాస్తున్నారో అంటూ తనకు చూపిస్తే ఇదేంటి కోడి గెలికినట్టు ఉందని అప్పు వెటకారంగా మాట్లాడుతుంది. నాకు లెటర్స్ రాశారని నీకు కుళ్ళు అంటూ కళ్యాణ్ అప్పుని ఆటపట్టిస్తారు.

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus