సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. శరత్ బాబు మరణం తర్వాత, కోలీవుడ్ యాక్టర్ బోస్ వెంకట్ సోదరి, ఆ తర్వాత ఆమె సోదరుడు కన్నుమూశారు. అలాగే బోయపాటి శ్రీను శిష్యుడు, టాలీవుడ్ యువ దర్శకుడు, ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల తండ్రి మరణించడం జరిగింది.యూట్యూబర్ దేవరాజ్ పాటిల్, ఎడిటర్ పి. వెంకటేశ్వరరావు వంటి వారు కూడా మరణించారు. ఇక నిన్ననే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వప్రసాద్ గారి తల్లి టి జి గీతాంజలి కూడా మరణించడం జరిగింది.
ఈ విషాదం నుండీ ఇంకా టాలీవుడ్ కోలుకోకముందే మరో యువ నటుడు గుండెపోటుతో మరణించడం అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే..’ఈ నగరానికి ఏమైంది’ తర్వాత తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న ‘కీడా కోలా’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నటించిన యువ నటుడు హరికాంత్ తాజాగా గుండెపోటుతో మరణించడం అందరినీ షాక్ కి గురిచేసినట్టయ్యింది.
అతని (Actor) వయసు 33 ఏళ్ళు మాత్రమే కావడం అత్యంత విషాదకరమైన విషయంగా చెప్పుకోవాలి. ఇటీవల వచ్చిన ‘కీడా కోలా’ చిత్రం టీజర్ లో కూడా ఇతను కనిపించాడు . ఇతనొక థియేటర్ ఆర్టిస్ట్. ఇప్పటికే పలు సినిమాల్లో నటించాడు. ‘కీడా కోలా’ ఇతనికి మంచి గుర్తింపు తెస్తుంది అని భావించాడు. కానీ ఇంతలో ఇలా అయిపోయింది.ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్న ఇతని జీవితం.. మొగ్గలోనే రాలిపోతుంది అని ఎవ్వరూ ఊహించలేదు.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!