మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్ ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. సర్కారు వారి పాట సినిమాలో ఇప్పటివరకు తెలుగు తెరపై కనిపించనంత మాస్ గా, గ్లామరస్ గా కనిపిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో హెయిర్ స్టెయిల్, క్యాస్టూమ్స్, మేకప్ డిఫరెంట్ గా ఉంటాయని ఆమె కామెంట్లు చేశారు.
తమిళంలో తాను మాస్ రోల్స్ లో చేసినా తెలుగులో చేయడం ఇదే తొలిసారి అని ఆమె కామెంట్లు చేశారు. కళావతి ఛాలెంజింగ్ రోల్ అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. తన దృష్టిలో ఏడిపించటం, నవ్వించడం చాలా కష్టమని సినిమాలో నాకు, మహేష్ కు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని ఆమె కామెంట్లు చేశారు. చిన్ని మూవీలో చింపిరి జుట్టుతో సాదా సీదా బట్టలతో కనిపించానని సర్కారు వారి పాటలో గ్లామరస్ గా కనిపించానని కీర్తి సురేష్ తెలిపారు.
మ మ మహేషా పాటను తాను చాలా ఇష్టపడి చేశానని ఫ్యాన్స్ డ్యాన్స్ చేసే విధంగా ఈ పాట ఉంటుందని కీర్తి సురేశ్ పేర్కొన్నారు. మహానటి మూవీలో ఛాన్స్ వచ్చిన సమయంలో ఈ సినిమాను నేను చేయగలనా? అని అనుకున్నానని సర్కారు వారి పాట మూవీలో మంచి మాస్ రోల్ చేశానని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. ఆర్టిస్ట్ గా ఏ పాత్ర వచ్చినా చేయాలని అప్పుడే పరిపూర్ణత ఉంటుందని కీర్తి సురేష్ కామెంట్లు చేశారు.
చెల్లెలి రోల్స్ లో నటిస్తే అలాంటి పాత్రలు మాత్రమే వస్తాయేమో అని ఆలోచించలేదని కీర్తి సురేష్ తెలిపారు. మంచి పాత్రలను వదులుకోవడం సరికాదని తనకు అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. రజనీకాంత్ సార్ సినిమాలో ఛాన్స్ దొరకడం కష్టమని ఆమె కామెంట్లు చేశారు. చిరంజీవి సార్ మూవీలో రోల్ ను ఇష్టపడి చేశానని ఆమె తెలిపారు. సర్కారు వారి పాటకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.