టాలీవుడ్లో ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్న స్టార్ హీరో అంటే నందమూరి బాలకృష్ణే అని చెప్పాలి. ‘సింహా’ కి ముందు ‘బాలయ్య పని అయిపోయింది’ అనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు బాలయ్య తప్ప కన్సిస్టెంట్ గా హిట్లు కొడుతున్న స్టార్ హీరో టాలీవుడ్లో లేరు అనే చెప్పాలి. ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ ‘భగవంత్ కేసరి’ ‘డాకు మహారాజ్’ వంటి హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు బాలయ్య.
త్వరలో ‘అఖండ 2’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకి కనుక ఓ మాదిరి టాక్ వచ్చినా రికార్డు ఓపెనింగ్స్ వస్తాయి.. మరో మాటలో ఓపెనింగ్స్ తోనే బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్స్ కూడా ఉంటుంది. బాలయ్య, దర్శకుడు బోయపాటి శీను కాంబో అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది.
ఇదిలా ఉండగా.. ‘అఖండ 2’ మాత్రమే కాదు.. ఆ తర్వాత బాలయ్య చేయబోయే సినిమాలు కూడా సూపర్ క్రేజీ ప్రాజెక్టులు అనడంలో సందేహం లేదు. ‘అఖండ’ బాలకృష్ణకి 110 వ సినిమా. దీని తర్వాత అంటే 111వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నాడు బాలయ్య. అలాగే రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సూపర్ హిట్ సీక్వెల్ ‘జైలర్ 2’ లో కూడా బాలయ్య గెస్ట్ రోల్ చేస్తున్నాడు. 15 నిమిషాల నిడివి కలిగిన పాత్ర ఇది. దీని తర్వాత 113వ సినిమాని క్రిష్ దర్శకత్వంలో చేయడానికి బాలయ్య రెడీ అయ్యారు. ‘ఆదిత్య 369’ కి సీక్వెల్ గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాకి బాలయ్యే కథ రెడీ చేశారు. క్రిష్ దానిని డెవలప్ చేసే పనిలో ఉన్నారు.సీనియర్ స్టార్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ ఈ ప్రాజెక్టుకి మెంటర్ గా వ్యవహరించనున్నారు అని తెలుస్తుంది.