నివేదా పేతురాజ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్ తో కొన్నాళ్లుగా ఈమె డేటింగ్లో ఉంది. నిన్న వినాయక చవితి రోజున ఈ విషయాన్ని వెల్లడించింది.ఈ సందర్భంగా తనకు కాబోయే భర్తతో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలు కూడా రివీల్ చేసింది. ఇక ‘జీవితాంతం ప్రేమ మయమే’ అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫోటోలు షేర్ చేసింది.
అలాగే లవ్ సింబల్స్, రింగ్.. ఎమోజిలు కూడా జత చేసింది. మరోపక్క ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక రాజ్ హిత్ దుబాయ్ లో పెద్ద బిజినెస్మెన్ అని తెలుస్తుంది. వీరి మధ్య ఎప్పుడు పరిచయం ఏర్పడింది? ఎప్పుడు అది ప్రేమగా మారింది అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా మారింది. ఇక నివేదాకి నెటిజన్లు కంగ్రాట్స్ అంటూ తమ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో మరికొంతమంది ఆకతాయిలు ‘విశ్వక్ సేన్ సంగతేంటి నివేదా’ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. విశ్వక్ సేన్- నివేదా..లది హిట్ పెయిర్. వీరి కాంబినేషన్లో ‘పాగల్’ ‘దాస్ క ధమ్కీ’ వంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల షూటింగ్ టైంలో విశ్వక్ సేన్, నివేదా..ల మధ్య ప్రేమ చిగురించిందని.. త్వరలో పెళ్లి కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అలాగే నివేదాకి విశ్వక్ సేన్ ఓ ఖరీదైన కారును గిఫ్ట్ గా ప్రెజెంట్ చేసి ప్రపోజ్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే నివేదా పెళ్లి ప్రకటనతో అవన్నీ గాసిప్స్ అని తేలిపోయినట్టు అనుకోవాలి.