Keerthy Suresh: యోగాసనాలతో కీర్తి సురేష్ గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న వీడియో..

Advertisement

ఆకట్టుకునేలా అందాలు ఆరబోయాలన్నా.. చూపు తిప్పుకోనివ్వకుండా గ్లామర్ ట్రీట్ ఇవ్వాలన్నా హీరోయిన్ల తర్వాతే ఎవరైనా.. ‘మహానటి’ తో పాటు మరికొన్ని సినిమాల్లో అచ్చ తెలుగు కట్టు, బొట్టుతో పద్ధతిగా కనిపించిన కీర్తి సురేష్ కూడా ఈమధ్య కుర్రకారుకి ఐ ఫీస్ట్ అనే రేంజ్‌లో వయ్యారాలు ఒలకబోస్తుంది.. ఇటీవల ‘సర్కారు వారి పాట’ లో అమ్మడు కాస్త డోస్ పెంచి మరీ కవ్వించింది. వీలు కుదిరినప్పుడల్లా హాట్ హాట్ లుక్స్‌తో..

డిఫరెంట్ అండ్ స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో ఫోటోషూట్స్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. యూత్ పోరగాళ్లకి ఫుల్ కిక్ ఇస్తోంది. కీర్తిలోని గ్లామర్ యాంగిల్ చూసి ఫాకవుతున్నారు మగజాతి ఆణిముత్యాలు.. ఈ కేరళ కుట్టి రీసెంట్‌గా ఓ వీడియో వదిలింది.. స్లీవ్ లెస్, షార్ట్ వేసుకుని యోగాసనాలు చేస్తూ అదరగొట్టేసింది. ఇంతలా అందాల విందు చేస్తూ ఆసనాలు వేయడంతో వీడియో వైరల్ అవుతోంది. ‘‘భం చికి భం చికి చెయ్ బాగా.. ఒంటికి యోగా మంచిదేగా’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus