అరడజను సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. అయినా గ్లామర్ కలిసొస్తుంది

వెండితెరపై విజయం అందరికీ అంత సులభంగా దక్కదు. కొందరు అందం, అభినయంతో ఆకట్టుకున్నా.. అదృష్టం మాత్రం కలిసిరాదు. ఈ కోవకే చెందుతుంది హాట్ బ్యూటీ కేతిక శర్మ. ఆరు అడుగుల అందంతో కుర్రకారు మనసు దోచుకున్నా, ఆమె కెరీర్ మాత్రం ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు.పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరితో ‘రొమాంటిక్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే గ్లామర్ డాల్‌గా పేరు తెచ్చుకున్నా, సినిమా మాత్రం నిరాశపరిచింది. ఆ తర్వాత ‘లక్ష్య’, ‘రంగ రంగ వైభవంగా’, పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ వంటి చిత్రాల్లో కనిపించినా, ఆమె కెరీర్‌కు అవి పెద్దగా ప్లస్ అవ్వలేదు.

Ketika Sharma

ఇలా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో శ్రీవిష్ణు సరసన ‘సింగిల్’ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో కేతిక ఎట్టకేలకు ఒక కమర్షియల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ హిట్ కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలను తీసుకురాలేకపోయింది.సినిమా ఫలితాలు ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో కేతిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోషూట్స్‌తో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తన గ్లామర్ డోస్‌తో నెట్టింట నిత్యం ట్రెండింగ్‌లో ఉంటూ, ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.ప్రస్తుతం కేతిక చేతిలో కొత్త ప్రాజెక్టులు ఏవీ లేకపోయినా, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉండేది కానీ ఇటీవల బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సరైన కథ పడితే స్టార్ హీరోయిన్‌గా ఎదిగే సత్తా ఉన్న ఈ బ్యూటీకి, భవిష్యత్తులోనైనా మంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి.

 ‘ఆగడు’ సెకండాఫ్ ‘పటాస్’ అయ్యుండేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus