అవును, మీరు విన్నది నిజమే. కెజిఎఫ్ నటుడు తండ్రి కాబోతుండడంతో ఆ అద్భుతమైన క్షణాలను తనివితీరా ఎంజాయ్ చేస్తున్నాడు. అతను మరెవ్వరో కాదు. కన్నడ నటుడు వశిష్ట సింహ (Vasishta Simha). కొన్ని ఏళ్ళు ప్రేమలో ఉన్న ఈ ప్రేమజంట కొన్నాళ్ల క్రితం నటి హరిప్రియను (Hariprriya) వివాహం చేసుకున్న సంగతి విదితమే. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని వారు ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. హరిప్రియ విషయానికొస్తే… కన్నడలో నటిగా మంచిపేరు సంపాదించారు.
రన్న, ఉగ్రమ్, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, బెల్ బాటమ్, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ చిత్రాలతో ఆమె ఫేమ్ సాధించారు. మరోవైపు వశిష్ఠ సింహా (Vasishta Simha)… ఆర్య లవ్ సినిమాతో అక్కడ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. ఇక కేజీఎఫ్‌లో విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తెలుగులో నారప్ప (Narappa), నయీం డైరీస్, ఓదెల రైల్వేస్టేషన్ (Odela Railway Station) వంటి తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు.
చివరిగా చాందినీ చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఏవమ్’, అనసూయ (Anasuya Bhardhwaj) ‘సింబా’ (Simbaa) సినిమాల్లో నటించాడు. వారి ప్రేమకు గుర్తుగా త్వరలో ఓ పండంటి బిడ్డ పుట్టబోతోంది. ఇక హరిప్రియ అంటే ఇక్కడ చాలామంది గుర్తు పట్టలేకపోవచ్చు కానీ నాచురల్ స్టార్ హీరో నాని (Nani) నటించిన ‘పిల్ల జమీందార్’ (Pilla Zamindar) సినిమా హీరోయిన్ అంటే గుర్తుకు వస్తుంది. ఇందులో అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయి సింధు పాత్రలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించింది హరిప్రియ.
పేరుకు కన్నడ ఇండస్ట్రీనే అయినా, ఆమె పక్కింటమ్మాయిలా అందరి మన్ననలు ఇక్కడ అందుకుంది. ఆ తరువాత ‘తకిత తకిట’ (Thakita Thakita) సినిమాలో కూడా చేసింది. అదేవిధంగా వరుణ్ సందేశ్‌తో (Varun Sandesh) కలిసి ‘అబ్బాయి క్లాస్- అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది.అంతేకాకుండా ఆమె నందమూరి బాలయ్య (Nandamuri Balakrishna) నటించిన ‘జై సింహా’లో (Jai Simha) కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే దీని తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించకుండా పోయింది. కానీ కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది. 2023లో ఈమె వశిష్టని ప్రేమ వివాహం చేసుకుంది.