నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన “కల్కి” (Kalki 2898 AD) విడుదలైన తర్వాత అప్పటివరకు హీరోల విషయంలో ఫ్యాన్ వార్స్ చేసుకున్న అభిమానులు.. ఒక్కసారిగా రామాయణ మహాభారతాల గురించి మాట్లాడుకోవడం, ఏకంగా కొట్టుకోవడం మొదలెట్టారు. సోషల్ మీడియా మొత్తం అర్జునుడు వర్సెస్ కర్ణుడు అనే టాపిక్ హల్ చల్ చేసింది. అర్జునుడు గొప్ప అని కొందరు, కాదు కర్ణుడు గొప్ప అని ఇంకొందరు తెగ హడావుడి చేశారు. కట్ చేస్తే.. సినిమా ఓటీటీ రిలీజ్ తర్వాత ఆ టాపిక్ మర్చిపోయారు జనాలు.
అయితే.. మళ్లీ ఇన్నాళ్లకు ఆ విషయాన్ని మళ్లీ ప్రస్తావించారు పాటల రచయిత అనంత్ శ్రీరామ్ (Ananth Sriram). ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్లో సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. “ఈమధ్యకాలంలో మన చరిత్రను మార్చే, తొక్కిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు భారతంలో అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప అని సినిమాలో చూపించడం చాలా తప్పు” అని సీరియస్ అయ్యారు అనంత్ శ్రీరామ్.
అదే సందర్భంలో.. ఒక సంగీత దర్శకుడు తనను పాటలో నుంచి హిందూ పదమైన బ్రహ్మాండ నాయక అనే పదాన్ని తీసేయమన్నాడు, అందుకే అప్పటినుండి అతనితో వర్క్ చేయడం మానేసాను, భవిష్యత్ లో కూడా చేయను” అని నొక్కి చెప్పారు అనంత్ శ్రీరామ్. అనంత్ శ్రీరామ్ అంత స్ట్రాంగ్ గా చెప్పడంతో.. సోషల్ మీడియాలో మళ్లీ అర్జున వర్సెస్ కర్ణ టాపిక్ మొదలైంది.
ఈ క్రమంలో నాగ్ అశ్విన్ చైనాలో మహాభారతం అనువాద కాపీలు అమ్ముడుపోతున్నాయట అంటూ పోస్ట్ పెట్టడం ఈ విషయమై ఇంకాస్త రచ్చ జరిగేలా చేసింది. ఎవరు గొప్ప అనే విషయంలో పురాణాల ప్రకారం చర్చలకు తావు లేదు, మరి ఈ సోషల్ మీడియా రచ్చ ఎప్పడు ఆగుతుందో చూడాలి. లేకపోతే.. “కల్కి 2″లో ఇందుకు నాగ్ అశ్విన్ సరైన సమాధానం అయినా చెప్పాలి.