‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రాఖీబాయ్ ఎంట్రీకి డేట్ ఫిక్స్..!

‘మే ఐ కం ఇన్’ అంటున్నాడు రాఖీ భాయ్. ఇతనెవరు… అనే క్వశ్చన్ అడిగేవాళ్ళే ఉండరనుకుంట. దాదాపు అందరూ ‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్సే కదా..! 2018 డిసెంబర్ 21న విడుదలైన ‘కె.జి.ఎఫ్’ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ కన్నడ చిత్రం అంత పెద్ద హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో యష్ ను ప్రెజెంట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా… ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. నిజానికి అక్టోబర్ 23నే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అనుకున్నారు. కానీ కరోనా వల్ల ప్లానింగ్ అప్సెట్ అయ్యింది. ఇక ఇప్పుడు షూటింగ్ కూడా ఫైనల్ స్టేజిలో ఉంది. అక్టోబర్ నెలాఖరుతో ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయిపోతుందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు 30రోజుల నుండీ 45 రోజల్లో ఫినిష్ అవుతాయట. దీంతో రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేసేసినట్టు తాజా సమాచారం.

2021 జనవరి 14న ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. కరోనా వైరస్ లాక్ డౌన్ తరువాత థియేటర్లలో విడుదల కాబోతున్న పెద్ద చిత్రం ఇదే కావడం విశేషం. కన్నడంతో పాటు తెలుగు, హిందీ,మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతుంది ఈ చిత్రం.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus