కెజిఎఫ్ విడుదలకు ముందు వరకు ఎలివేషన్స్ కు రజనీకాంత్ రేంజ్ అనేవారు. కెజిఎఫ్ విడుదల తర్వాత మాత్రం “కెజిఎఫ్ ఎలివేషన్స్” అంటున్నారు. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ కు అది నిదర్శనం. ఒక మాస్ హీరోను తెరపై ఎలా ప్రెజంట్ చేయాలి అనేదానికి నిఘంటువు లాంటి సినిమా “కెజిఎఫ్”. కనీస స్థాయి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమా సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. యష్ పుట్టినరోజును పురస్కరించుకొని టీజర్ ను రేపు రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ.. లీక్ అవ్వడంతో ఉన్నట్లుండి డిసెంబర్ 7 రాత్రి 9.29 గంటలకు విడుదల చేసేసారు.
లీక్ అవ్వడం అనేది బాధపడాల్సిన విషయమే అయినప్పటికీ.. టీజర్ కంటెంట్ చూసినవాళ్లకి మాత్రం మతులు పోతున్నారు. టీజర్ లో కనిపించిన ప్రొడక్షన్ డిజైన్, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఆర్టిస్టులు, ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్. వీటన్నిటికీ మించి యష్ కి మెషీన్ గన్ తో ఇచ్చిన ఎలివేషన్ వీర లెవల్లో ఉన్నాయి. వేడెక్కిన గన్ తో సిగిరెట్ వెలిగించే సీక్వెన్స్ చాలు మాస్ థియేటర్లు దద్దరిల్లడానికి. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ టీజర్ లోనే ఈ స్థాయిలో ఉంటే.. ఇక సినిమాలో ఇంకే స్థాయిలో ఉంటాయో అనే ఊహే ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
టీజర్ మాత్రం మాములుగా లేదబ్బా.. ఆ బ్యాగ్రౌండ్ స్కోర్, సీజీ వర్క్ & యష్. సెకండ్ చాఫ్టర్ సరికొత్త రికార్డులు సృష్టించడమే కాదు.. మాస్ సినిమాలకు ఒక బెంచ్ మార్క్ గా మిగిలిపోతుంది. ఈ టీజర్ చూసిన ప్రభాస్ అభిమానులు మాత్రం.. యష్ కే ఈ రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడంటే.. ఇక ప్రభాస్ కు “సలార్”లో ఇంకే స్థాయిలో ఎలివేషన్స్ ఇస్తాడో అని సంబరపడిపోతున్నారు.