నారా రోహిత్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ ‘ప్రతినిధి 2’ అనే సినిమా చేశాడు. 2024 ఎన్నికల హడావిడిలో రావడం వల్ల ఆ సినిమాని జనాలు పట్టించుకోలేదు. కానీ కంటెంట్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్,మంచు మనోజ్..లతో కలిసి ‘భైరవం’ అనే మల్టీస్టారర్ సినిమాలో నటించాడు నారా రోహిత్. దానికి కూడా మాస్ లో మంచి అప్రిసియేషన్ వచ్చింది. సో ఒక రకంగా తన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా పగడ్బంధీగా ప్లాన్ చేసుకుంటున్నాడు నారా రోహిత్ అని చెప్పాలి.
ఇక అతని నుండి రాబోతున్న మరో మూవీ ‘సుందరకాండ’. వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్స్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నారా రోహిత్ చాలా గ్యాప్ తర్వాత చేసిన ఫ్యామిలీ మూవీ కాబట్టి.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వెంకటేష్ నిమ్మలపూడి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సీనియర్ నరేష్, అజయ్, సత్య వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాతో ప్రభాస్ ‘ఈశ్వర్’ మూవీ హీరోయిన్ శ్రీదేవి రీ ఎంట్రీ ఇస్తుంది.
ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న నారా రోహిత్ స్నేహితులు, కొంతమంది సినీ పెద్దలు వీక్షించడం జరిగింది. ‘మూలా నక్షత్రంలో పుట్టిన ఓ కుర్రాడు రిలేషన్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. దీంతో తనకు సరైన పార్ట్నర్ దొరికే వరకు పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అవుతాడు. ఆ డెసిషన్ వల్ల అతని ఏజ్ బారైపోతుంది. ఆ తర్వాత మరో అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ తన మాజీ లవర్ వల్ల అనుకోని సమస్య వచ్చి పడుతుంది. అదేంటి? అనే ఇంట్రెస్టింగ్ లైన్ తో సినిమా కథనం ఉంటుందట. కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది అంటున్నారు. మరి మొదటి షోతోనే ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.