సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్లో టర్నింగ్ పాయింట్ మూవీ అంటే ‘అర్జున్ రెడ్డి’ అనే చెప్పాలి. అంతకు ముందు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘పెళ్ళిచూపులు’ వంటి హిట్ సినిమాల్లో నటించినప్పటికీ.. విజయ్ దేవరకొండకి ఫ్యాన్ బేస్ ఏర్పడేలా చేసిన సినిమా అర్జున్ రెడ్డి అనే చెప్పాలి. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
ఇదే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే సైతం పెద్ద సినిమాల్లో ఛాన్సులు అందుకుంది. రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేసిందో.. రిలీజ్ కి ముందు ఈ సినిమా పడ్డ పురిటి నొప్పులు అన్నీ ఇన్నీ కావు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చాలా మంది హీరోలకు ఈ కథని వినిపించాడు. వాళ్ళంతా రిజెక్ట్ చేశారు. దీంతో నిర్మాతలు కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో సందీప్ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా ‘భద్రకాళి పిక్చర్స్’ అనే సంస్థను స్థాపించి నిర్మించడం జరిగింది. అన్ని ఇబ్బందులు దాటుకుని 2017 ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధించింది.
ఈ ఆగస్టు 25 కి ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ అయ్యి 8 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఒకసారి టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 7.61 cr |
సీడెడ్ | 1.82 cr |
ఉత్తరాంధ్ర | 1.17 cr |
ఈస్ట్ | 0.77 cr |
వెస్ట్ | 0.50 cr |
గుంటూరు | 0.94 cr |
కృష్ణా | 0.94 cr |
నెల్లూరు | 0.35 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 14.10 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 7.25 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 21.35 cr |
‘అర్జున్ రెడ్డి’ చిత్రం రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.21.35 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.16 కోట్ల భారీ లాభాలు అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘అర్జున్ రెడ్డి’