బయట వర్షాలు నాన్ స్టాప్ గా కురుస్తున్నాయి.వర్షాకాలం వచ్చిందంటే.. జలుబు, దగ్గు, జ్వరం.. వాటితో బాధపడే వారు ఎక్కువ మందే ఉంటారు. సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. అయితే కారణాలేంటో చెప్పలేదు కానీ ఓ నటి హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు షేర్ చేసి.. తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఆమె మరెవరో కాదు మౌనీ రాయ్. తెలుగు ప్రేక్షకులకు ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ మూవీలో ఐటెం సాంగ్ లో చిందులేసింది. గత ఏడాది వచ్చిన ‘బ్రహ్మాస్త్రం’ మూవీలో లేడీ విలన్ గా నటించి ఆకట్టుకుంది. ఆ సినిమాలో ప్రారంభం నుండి షారుఖ్ ఖాన్, నాగార్జున వంటి స్టార్ హీరోలు పోషించిన పాత్రలను మర్డర్ చేసి క్లైమాక్స్ వరకు హీరో రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ ల పాత్రలను ముప్పుతిప్పలు పెట్టే మాటలాడిగా కనిపించింది.
ఈమెలో (Actress) అలాంటి గొప్ప విలన్ ఉందని జనాలకి తెలీదు. అప్పటివరకు ఈమె స్పెషల్ సాంగ్స్ లో అందాలు ఆరబోయడానికి మాత్రమే పరిమితమని అంతా భావించేవారు. కానీ ‘బ్రహ్మాస్త్రం’ మూవీతో విలక్షణమైన పాత్రలకు కూడా ఈమెను ఎంపిక చేసుకోవచ్చు అనే భరోసా ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ఈమె 9 రోజుల పాటు హాస్పిటల్ లో ఉందట.
ఇంటికి వచ్చినందుకు ఆనందంగా ఉంది అంటూ ఈమె రాసుకొచ్చింది. అలాంటి కఠినమైన క్షణాల్లో తనకి తోడుగా ఉన్నందుకు తన స్నేహితులకి థాంక్స్ చెబుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో ఈమె హాస్పిటల్ బెడ్ పై ఉన్నట్టు కొన్ని ఫోటోలు స్పష్టం చేశాయి