మురళీ శర్మ, జాన్ విజయ్, రాధిక శరత్‌కుమార్, సిద్ధార్థ్ శంకర్ (Cast)
బాలాజీ కుమార్ (Director)
కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్‌విఎస్ అశోక్ కుమార్ (Producer)
గిరీష్ గోపాలకృష్ణన్ (Music)
శివకుమార్ విజయన్ (Cinematography)
Release Date : జూలై 21, 2023
‘నకిలీ’ ‘డాక్టర్ సలీమ్’ ‘బిచ్చగాడు’ వంటి సినిమాలతో హీరోగా తెలుగులో మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోని. ఆ తర్వాత అతను కొత్త కథలతో సినిమాలు చేశాడు. కానీ అందులో చాలా వరకు ప్లాప్స్ గా, ఒకటి రెండు యావరేజ్ రిజల్ట్స్ తో సరిపెట్టుకున్నాయి. తర్వాత అతని సినిమాలను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడం మానేసేంతవరకు వెళ్ళింది పరిస్థితి. పైగా సింగిల్ ఎక్స్ప్రెషన్స్ తో విసిగిస్తున్నాడు విజయ్ ఆంటోని అనే ముద్ర ఇతనిపై పడింది. ఈ క్రమంలో అతను ‘బిచ్చగాడు 2 ‘ సినిమా చేశాడు. ‘బిచ్చగాడు’ కి ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఎగబడి చూసి.. దీన్ని తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలబెట్టారు. ఆ సినిమా రిజల్ట్ ఇతని కెరీర్ కి బూస్టప్ ఇస్తుంది అని విజయ్ భావించాడు. ఈ క్రమంలో అతను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయిన ‘హత్య’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విజయ్ కి మరో సక్సెస్ అందించిందో లేదో తెలుసుకుందాం రండి :
కథ: పాపులర్ మోడల్ అయిన లైలా (మీనాక్షీ చౌదరి) ముంబై నుండి హైదరాబాద్ కి వస్తుంది. అయితే ఆ తర్వాత ఆమె మిస్ అవుతుంది. కట్ చేస్తే హైదరాబాద్ లో ఉన్న ఆమె ఫ్లాట్‌లో విగత జీవిగా పడి ఉంటుంది. ఈమె హత్య వెనుక కారణాలు ఏంటి? హత్య చేసింది ఎవరు? అనేది దర్యాప్తు చేయాల్సిందిగా ఐపీఎస్ సంధ్య (రితికా సింగ్)కి బాధ్యతలు అప్పగిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. సెలబ్రిటీ కావడంతో లైలా హత్య కేసు సంధ్యకి తలనొప్పిగా మారుతుంది. లైలా హత్య కేసులో నిందితులుగా… ఆమె బాయ్ ఫ్రెండ్ సతీష్ (సిద్ధార్థ శంకర్), ముంబైలో మోడల్ కో ఆర్డినేటర్ ఆదిత్య కౌశిక్ (మురళీ శర్మ), ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అర్జున్ వాసుదేవ్ (అర్జున్ చిదంబరం), అనాధ ఆశ్రమంలో తనను పెంచిన మహిళ కుమారుడు బబ్లూ (కిషోర్ కుమార్)… లను భావిస్తుంది సంధ్య.
ఈ నలుగురిలోనే హంతకుడు ఉన్నట్లు ఆమె అభిప్రాయపడుతుంది కానీ ఎటువంటి ఆధారాలు లభించవు. ఈ క్రమంలో డిటెక్టివ్ వినాయక్ (విజయ్ ఆంటోనీ) రంగంలోకి దిగుతాడు. సంధ్య, వినాయక్ లు ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు అన్నది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: హీరో విజయ్ ఆంటోనీ ఎప్పటిలానే సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో లాగించేశాడు. పెద్దగా యాక్టింగ్ డిమాండ్ చేసే పాత్ర కూడా కాదు ఇది. సీరియస్ డ్రామా కాబట్టి.. హ్యూమర్ కి అస్సలు చోటు లేదు. కాబట్టి విజయ్ కి ఈజీగా పాస్ మార్కులు పడిపోతాయి. అయితే ఈ సినిమాలో అతను గ్రే హెయిర్‌తో కనిపించడం.. అందరికీ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మీనాక్షీ చౌదరి మోడల్ గా నటించింది అనే కంటే కాసేపు కనిపించింది అని చెప్పుకోవడం బెటర్. ఆమె పాత్ర నిడివి అంత తక్కువగా ఉంటుంది.సో ఆమె పెర్ఫార్మన్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఐపీఎస్ సంధ్య పాత్రలో రితికా సింగ్ బాగానే చేసింది.
రాధిక శరత్ కుమార్, జాన్ విజయ్,మురళీ శర్మ వంటి వారు ఉన్నంతలో బాగానే చేశారు. కానీ మురళీ శర్మ పాత్ర డబ్బింగ్ వేరొకరితో చెప్పించడం వల్ల కామెడీగా అనిపిస్తుంది. సిద్ధార్థ శంకర్, అజిత్ చిదంబరం, కిషోర్ కుమార్. వంటి వారి పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు.కానీ ఉన్నంతలో వారు ఓకే అనిపిస్తారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు బాలాజీ కుమార్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశాన్ని ఎంపిక చేసుకున్నప్పటికీ దానికి ఫ్యామిలీ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందువల్ల థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తక్కువగా.. సాగదీత ఎక్కువగా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది ఈ ‘హత్య’. ఫస్ట్ 15 నిమిషాలు ఓకే అనిపించినా తర్వాత బోర్ కొట్టిస్తుంది.సెకండ్ హాఫ్ కూడా మెప్పించడు.ఎక్కువ శాతం విసిగిస్తుంది. ట్విస్ట్ కూడా థ్రిల్లింగ్ గా అనిపించదు. హీరో.. జరిగింది అంతా కళ్ళకి కట్టినట్టు చెబుతుండటం ఎందుకో కన్విన్సింగ్ గా అనిపించదు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ బాగుంది. గిరీష్ గోపాలకృష్ణన్ నేపధ్య సంగీతం ఓకే. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు బాగానే అనిపిస్తాయి.
విశ్లేషణ: థ్రిల్లర్ సినిమాలు అందులోనూ మర్డర్ మిస్టరీలను ఇష్టపడేవారికి కూడా ఈ ‘హత్య’ కొత్తగా అనిపించదు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువగా ఉండవు. ‘బిచ్చగాడు 2’ తర్వాత విజయ్ ఆంటోని మరో హిట్ సినిమా తీసుంటాడు అనుకుని ‘హత్య’ చూడటానికి థియేటర్ కి వెళ్తే నిరుత్సాహపడడం గ్యారంటీ.
రేటింగ్ : 1.75/5
Rating
1.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus