Annapurna Photo Studio Review in Telugu: అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
July 20, 2023 / 09:55 AM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
చైతన్య రావ్ (Hero)
లావణ్య, మిహిరా (Heroine)
ఉత్తర రెడ్డి, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య, వాసు ఇంటూరి తదితరులు (Cast)
చెందు ముద్దు (Director)
యష్ రంగినేని (Producer)
ప్రిన్స్ హెన్రీ (Music)
పంకజ్ తొట్టాడ (Cinematography)
Release Date : జూలై 21, 2023
ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ మూవీ ఒకటి. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం. ‘పెళ్ళి చూపులు’ ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలను అందించి మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించడం, ’30 వెడ్స్ 21′(వెబ్ సిరీస్) ఫేమ్ చైతన్య రావు ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండటం, ‘ఓ పిట్ట కథ’ వంటి ఓటీటీ హిట్ ను అందించిన చెందు ముద్దు ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ..
వీకెండ్ మూవీ లవర్స్ ఫోకస్ ఈ సినిమా పై పడింది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉండటం కూడా ఈ సినిమా పై కొంత బజ్ ఏర్పడటానికి కారణం అని చెప్పొచ్చు. మరి వాటి స్థాయిలో ఈ సినిమా ఉందా? లేదా? అనేది తెలుసుకుందాం రండి :
కథ : 1980 ల నేపథ్యం కలిగిన కథ ఇది. గోదావరి పక్కనున్న కపిలేశ్వరపురం అనే ఊరికి చెందిన చంటి(చైతన్య రావు) ఆత్మహత్య చేసుకోవడానికి ఆ పక్క ఊరికి వెళ్లి అక్కడ ఎత్తైన కొండ మీద నుండీ దూకేస్తాడు. అయితే అదృష్టవశాత్తు అతను పోలీసుల జీప్ పై పడతాడు. అదే టైములో అతను రాసిన సూసైడ్ నోట్ కూడా పోలీసులకి లభిస్తుంది. అతన్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ఆ సూసైడ్ నోట్ ను చదవడం మొదలు పెడతారు పోలీసులు. ఈ క్రమంలో చంటి తన సొంత ఊరిలో ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ ని నడుపుకుంటూ ఉంటాడు అని తెలుస్తుంది.
వయసు మీద పడినా ఇతనికి పెళ్లవ్వదు. అలాంటి టైం లో గౌతమి(లావణ్య) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కొన్ని అపార్ధాల తర్వాత ఆమె కూడా ఇతన్ని ప్రేమించడం మొదలుపెడుతుంది. అయితే తర్వాత చంటి జాతకం ప్రకారం అతని ప్రాణానికి ప్రమాదం ఉందని గౌతమికి తెలుస్తుంది. అటు తర్వాత ఓ అమ్మాయిని కాపాడే క్రమంలో.. అనుకోకుండా చంటి ఓ హత్య చేస్తాడు? ఆ టైంలో తీసిన ఫొటోలతో ఓ వ్యక్తి అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు.
చంటిని మరో హత్య చేయాలని డిమాండ్ చేస్తాడు? అసలు వీటన్నిటికీ లింక్ ఏంటి? చంటి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు? చివరికి పోలీసులు అతనికి ఏ విధంగా సాయపడ్డారు? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : చైతన్య రావు పాపులారిటీని సంపాదించుకుందే ఏజ్ బార్ క్యారెక్టర్లలో కనిపించి.. ! ఈ సినిమాలో కూడా అతనికి అలాంటి పాత్రే దొరికింది. ఇంకేముంది చెలరేగిపోయాడు. తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకున్నాడు. చాలా చోట్ల.. నవించాడు. హీరోయిన్ లావణ్య.. లుక్స్ బాగా కుదిరాయి. పెర్ఫార్మన్స్ తో కూడా పర్వాలేదు అనిపిస్తుంది. సీరియల్ నటిగా పాపులర్ అయిన ఉత్తర రెడ్డి ఈ సినిమాలో హీరో చెల్లెలు పద్దు అనే గుర్తుండిపోయే పాత్ర చేసింది. లలిత్ ఆదిత్య కూడా ఓకే.
వాసు ఇంటూరి కానిస్టేబుల్ గా కనిపించి అక్కడక్కడా నవ్వించాడు. నిర్మాత యష్ రంగినేని కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేశాడు. నటుడిగా అతనికి ఇదే మొదటి సినిమా. కానీ అనుభవం ఉన్న నటుడిలానే మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. వైవ రాఘవ తన మార్క్ కామెడీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకి నటించారు.
సాంకేంతిక నిపుణుల పనితీరు : చెందు ముద్దు మరోసారి గ్రామీణ నేపధ్యం కలిగిన కథనే ఎంపిక చేసుకున్నాడు. కాకపోతే ఈసారి 1980 ల నాటి బ్యాక్ డ్రాప్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ విషయంలో అతను తన స్క్రీన్ ప్లే తో ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ సెకండ్ హాఫ్ విషయంలో తన మొదటి సినిమా ‘ఓ పిట్ట కథ’ ఫీల్ లోకి తీసుకెళ్లిపోయి కొంత బోర్ కొట్టించాడు. ఆ సినిమాలో మాదిరే.. ‘ఇక సినిమా అయిపోయింది’ అని ప్రేక్షకులు సీట్లలో నుండి లేచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్న టైంలో ట్విస్ట్ లు రివీల్ చేయడం మొదలుపెట్టాడు.
తన మొదటి సినిమాని ఎక్కువగా ఓటీటీలో చూశారు కాబట్టి.. ప్రేక్షకులు వాటిని బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ ఈసారి అలాంటి ట్విస్ట్ లే రిపీట్ అవుతుంటే ప్రేక్షకులు పెద్దగా సర్ప్రైజ్ ఫీల్ అవ్వకపోవచ్చు. అలాగే టైటిల్ కి సినిమా కథకి సంబంధం ఏంటి అనే డౌట్ కూడా రావచ్చు. ఆ ఫోటో స్టూడియోని బేస్ చేసుకుని కథ జరుగుతుందేమో అని అనుకుంటే. ఇక్కడ అలా ఉండదు. అయితే నిర్మాణ విలువలు బాగున్నాయి.
సినిమాటోగ్రాఫర్ పంకజ్ తొట్టాడ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ఇతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రిన్స్ హెన్రీ అందించిన మ్యూజిక్ కూడా బాగానే ఉంది.
విశ్లేషణ : హీరో ఫ్రెండ్స్ కామెడీ ట్రాక్స్… బి,సి సెంటర్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. వీకెండ్ సినిమా లవర్స్ కి ఈ సినిమా (Annapurna Photo Studio) యావరేజ్ అనిపించొచ్చు. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఓకే లేకుంటే కష్టమే.
రేటింగ్ : 2.25/5
Rating
2.25
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus