‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రకాష్ , ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన తాజాగా చిత్రం ‘ఖైదీ’. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసాడు. కార్తీ గత చిత్రం ‘దేవ్’ డిజాస్టర్ అవ్వడంతో.. ‘ఖైదీ’ పై ఎటువంటి అంచనాలు లేవు. అసలు ఈ సినిమా వస్తున్నట్టు కూడా ఎవ్వరికీ తెలీదు. కానీ ట్రైలర్ విడుదలయ్యాక కొంత మేర అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ అధినేత రాధామోహన్ రిలీజ్ చేసాడు. ఇక ‘విజిల్’ చిత్రం పై భారీ క్రేజ్ ఉండడంతో ‘ఖైదీ’ కి మార్నింగ్ షో లు డల్ గా మొదలయ్యాయి.
అయితే పాజిటివ్ టాక్ రావడంతో.. ఈవెనింగ్ నుండీ హౌస్ ఫుల్స్ పడ్డాయి. దీంతో మార్నింగ్ షోస్ తో పోలిస్తే ఈవెనింగ్ షోస్ కు బాగా కలెక్ట్ చేసింది. అయినప్పటికీ 1 కోటి దాటి షేర్ రాలేదు. మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలు మొత్తం కలిపి.. 96 లక్షల వరకూ షేర్ ను రాబట్టింది. అయితే ఈరోజు మాత్రం ‘విజిల్’ కంటే ఎక్కువగా ‘ఖైదీ’ బుకింగ్స్ జరుగుతున్నాయి. దీంతో ఈ చిత్రానికి మొదటి రోజుకంటే డబుల్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి తెలుగు థియేట్రికల్ రైట్స్ 4 కోట్లకు జరిగాయి. దీంతో ఈజీగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.