తెలుగు సినీ ప్రపంచంలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ఎప్పటికీ పదిలమని ఆయన తాజా చిత్రం ఖైదీ నంబర్ 150 మూవీ నిరూపించింది. పదేళ్ల తర్వాత చిరు హీరోగా నటించిన ఈ సినిమా కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11 న రిలీజ్ అయిన మెగాస్టార్ 150 వ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతోంది. నిన్నటితో వారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 108. 48 కోట్లు కలెక్ట్ చేసినట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. దీంతో అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్ లో చేరిన రెండో తెలుగు మూవీగా ఖైదీ నంబర్ 150 రికార్డ్ నమోదు చేసింది.
మొదటి స్థానంలో బాహుబలి ఉంది. ఈ చిత్రం మూడు రోజుల్లో వంద కోట్ల మార్క్ ని చేరుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఈ మార్క్ ని చేరుకోవడానికి 8 రోజులు పట్టింది. మాస్ డైరక్టర్ వి వి వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఫిల్మ్ భారీ షేర్ రాబట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీక్ 80.70 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఈ మూవీ లాంగ్ రన్లో మరిన్ని రికార్డులను నమోదు చేయనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.