Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • శివ కందుకూరి (Hero)
  • తేజు అశ్విని (Heroine)
  • రాజీవ్ కనకాల, చైతన్య కృష్ణ, రాజ్ కుమార్ కసిరెడ్డి, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు (Cast)
  • ప్రమోద్ హర్ష (Director)
  • వెంకట్ ఆర్.పాపుడిప్పు (Producer)
  • ప్రశాంత్ ఆర్.విహారి (Music)
  • క్రాంతి వర్ల (Cinematography)
  • పవన్ నరవ (Editor)
  • Release Date : ఫిబ్రవరి 20, 2026
  • హర్షిక ప్రొడక్షన్స్ (Banner)

శివ కందుకూరి హీరోగా ప్రమోద్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “నవాబ్స్ కేఫ్”. సింపుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం టైటిల్ ఇష్యూ కారణంగా పోస్ట్ పోన్ అయ్యి.. ఎట్టకేలకు ఇవాళ (ఫిబ్రవరి 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతోనైనా శివ కందుకూరి హీరోహా కమర్షియల్ హిట్ అందుకోగలిగాడా లేదా అనేది చూడాలి..!!

Nawabs Cafe Movie Review

కథ: తాతల ఆస్తి అయిన నవాబ్ కేఫ్ ను తండ్రి రంగనాథ్ (రాజీవ్ కనకాల) వంశపారంపర్యంగా నడపడాన్ని ఎందుకో సహించలేకపోతుంటాడు కొడుకు రాజా (శివ కందుకూరి). ఎవరైనా తనని చాయ్ వాలా అంటే అస్సలు ఊరుకోడు.

అలాంటి రాజా ఊహించని స్థితిలో నవాబ్ కేఫ్ బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది.

అందుకు కారణం ఏంటి? ఇష్టం లేని బిజినెస్ ని ఎందుకు టేకప్ చేశాడు? తండ్రి స్థాయిలో సక్సెఫుల్ గా రన్ చేయగలిగాడా? అనేది “నవాబ్ కేఫ్” చూసి తెలుసుకోవాల్సిన చిత్రం.

నటీనటుల పనితీరు: శివ కందుకూరి ఎమోషనల్ సీన్స్ లో పర్వాలేదనిపించుకున్నాడు. స్క్రీన్ ప్రెజన్స్ వరకు ఓకే కానీ, నటుడిగా మాత్రం పరిణితి చెందాల్సిన అవసరం ఉంది.

తేజు అశ్విని హావభావాలతో అలరించింది. తక్కువ సన్నివేశాలు ఉన్నప్పటికీ, తనదైన నటనతో ఆకట్టుకుంది.

రాజీవ్ కనకాల తండ్రి పాత్రలో తన మార్క్ నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు కానీ.. క్యారెక్టర్ సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం, ఎమోషనల్ సీన్స్ పడకపోవడంతో క్యారెక్టర్ ద్వారా ఎమోషన్ సరిగ్గా పండలేదు.

నెగిటివ్ షేడ్ లో చైతన్య కృష్ణ పర్వాలేదనిపించుకున్నాడు. అయితే.. అతని క్యారెక్టర్ ఆర్క్ కూడా సరిగా లేకపోవడంతో అదీ వర్కవుట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: ప్రశాంత్ ఆర్.విహారి ఒక్కడే టెక్నికల్ గా సినిమాకి న్యాయం చేశాడు. సినిమా మొత్తానికి బాగున్న ఏకైక అంశం అతడి పాటలు, నేపథ్య సంగీతం.

అయితే.. సౌండ్ మిక్సింగ్ సరిగా లేకపోవడంతో, చాలాచోట్ల డైలాగ్స్ వినపడలేదు. ఇంకొన్ని డైలాగ్స్ కూడా లైఫ్ లో రికార్డ్ అయినవి, సరిగా మిక్సింగ్ చేయనట్లుగా తెలిసిపోతుంది.

ఎడిటింగ్ లో క్లారిటీ లోపించింది. చాలా సన్నివేశాల్లో కంటిన్యూటీ మిస్ అయ్యింది.

దర్శకుడు ప్రమోద్ ఎంచుకున్న పాయింట్ లో నావెల్టి ఉన్నప్పటికీ, డీలింగ్ లో పట్టు లోపించింది. ఎమోషన్ ను ఎలివేట్ చేసే సరైన సన్నివేశాలు కానీ డైలాగులు కానీ పడలేదు. పైపెచ్చు.. థీమ్ అనేది ఇటీవల వచ్చిన “ఇడ్లీ కొట్టు, మిస్ ఇండియా” సినిమాలని తలపించడం మైనస్ అయ్యింది. ఓవరాల్ గా.. దర్శకుడిగా ప్రమోద్ హర్ష మెప్పించలేకపోయాడని చెప్పాలి.

విశ్లేషణ: ఇన్స్పైర్ చేసే కథలు, పాత్రల్లో నవ్యత కచ్చితంగా ఉండాలి. అసలే నవ్యత లేని సినిమా టెక్నికల్ గాను వీక్ గా ఉండడంతో కనీస స్థాయిలో ఆకట్టుకోలేక చతికిలపడింది.

ఫోకస్ పాయింట్: ఛాయ్ లో చమక్కు లేదు భాయ్!

రేటింగ్: 1.5/5

Click Here To Read in ENGLISH

 

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus