సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్లో ఓ అండర్ రేటెడ్ మూవీగా నిలిచింది ‘ఖలేజా'(Khaleja). 2010 అక్టోబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆ టైంలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. త్రివిక్రమ్ (Trivikram) – మహేష్ బాబు ‘అతడు’ (Athadu) వంటి కల్ట్ మూవీ తర్వాత ఓ కొత్త పాయింట్ తీసుకుని ‘ఖలేజా’ చేశారు. 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత మహేష్ బాబు నుండి వచ్చిన ఈ సినిమా ఆ టైంలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. అయితే టీవీల్లో బాగా చూశారు.
దాదాపు 15 ఏళ్ళ తర్వాత ఈ సినిమాని రీ- రిలీజ్ చేశారు. మే 30 న 4K కి డిజిటలైజ్ చేసి ఈ చిత్రాన్ని రీ- రిలీజ్ చేయడం జరిగింది. అప్పట్లో ప్లాప్ అయినా.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టింది ‘ఖలేజా’. సోమవారం రోజు కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఒకసారి ‘ఖలేజా'(4K) 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 5.05 cr |
సీడెడ్ | 0.53 cr |
ఉత్తరాంధ్ర | 0.84 cr |
ఈస్ట్ | 0.31 cr |
వెస్ట్ | 0.38 cr |
గుంటూరు | 0.52 cr |
కృష్ణా | 0.47 cr |
నెల్లూరు | 0.19 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 8.29 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.66 cr |
ఓవర్సీస్ | 1.21 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 10.16 cr (షేర్) |
కొత్త సినిమాల పోటీగా ఉన్నా సరే ‘ఖలేజా'(4K) రీ- రిలీజ్ లో.. 4 రోజుల్లో ఏకంగా రూ.10.16 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.