బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరున్న జంట సిద్దార్థ్ మల్హోత్రా & కియారా అద్వానీ జంట. ఈ జంట గత ఏడాది ఫిబ్రవరి లో వివాహ బంధం ద్వారా ఒకటైన సంగతి తెల్సిందే. మూడు సంవత్సరాలు ప్రేమలో ఉన్న ఈ జంట , ఏ రోజు ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. అంత గోప్యంగా ఉంచి ఇద్దరి పరస్పర నిర్ణయంతో తమ వివాహం గురించి ప్రకటించి సినీ అభిమానుల్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు ఈ జంట.
వీళ్ళ ప్రేమకు గుర్తుగా ఈ సంవత్సరం జూన్ 16న పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది కియారా. వీరు ఇద్దరు అప్పట్లో చాలా సంతోషంతో పాప ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే రీసెంట్ గా వీరి ముద్దుల పాపాయి కి నామకరణం చేసారు. ఈ సంగతిని కియారా అద్వానీ & సిద్దార్థ్ సంయుక్తంగా ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో చేసారు. ఇద్దరి చేతుల్లో తమ కూతురి పాదాలు ఉంచుతూ ఒక ఫోటోని షేర్ చేసారు. కాప్షన్ లో పాప పేరు ” సారాయ మల్హోత్రా ” గా పేర్కొన్నారు. ఈ ప్రిన్సెస్, యువరాణి అని అర్ధం వస్తుందంట.
కియారా అద్వానీ తెలుగు లో భరత్ అనే నేను, వినయవిధేయరామ, గేమ్ చేంజెర్ చిత్రాలలో అలరించింది. చివరగా వార్ 2 మూవీలో నటించగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రీల్స్ లో రిలీజ్ అయినా ఈ మూవీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.