Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 30, 2026 / 10:00 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • పూర్వాజ్ (Hero)
  • జ్యోతి పూర్వాజ్ (Heroine)
  • చంద్రకాంత్, అర్చన అనంత్, తదితరులు (Cast)
  • పూర్వాజ్ (Director)
  • పూర్వాజ్, పాడీ , పద్మనాభ రెడ్డి (Producer)
  • ఆశీర్వాద్ అండ్ సుమన్ (Music)
  • జగదీష్ బొమ్మిశెట్టి (Cinematography)
  • పూర్వాజ్ (Editor)
  • Release Date : 30th అక్టోబర్ 2026
  • థింక్ సినిమా (Banner)

సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ కనిపెట్టి వాట్సప్ చేసిన వాళ్ళకి కోటి రూపాయల బహుమతి ఇస్తా అంటూ దర్శకుడు పూర్వాజ్ ఇచ్చిన ప్రకటనతో కిల్లర్ సినిమా వార్తల్లో నిలిచింది. ప్రీమియర్ షోలకి జనాలు క్యూ కట్టేలా కూడా చేసింది ఆ ప్రకటన. ఆడియన్స్ కోటి రూపాయల బహుమతి సంగతి పక్కన పెడితే.. మేకర్స్ కి ఈ సినిమా కోట్లు తెచ్చే విధంగా ఈ సినిమా ఉందో లేదో తెలుసుకుందాం రండి:

KilleR Movie Review

కథ: కొన్ని మర్డర్ కేసుల విషయంలో పూర్వాజ్ (పూర్వాజ్) అనే పోలీస్ ఆఫీసర్ తన అసిస్టెంట్ గాయిత్రి మూర్తితో ( అర్చన అనంత్ ) కలిసి దర్యాప్తు చేపడతాడు. ఇందులో సాక్షులైన వారిని పిలిపించి విచారిస్తున్న క్రమంలో.. ఆ మర్డర్లకి ఒకే అమ్మాయి (జ్యోతి పూర్వాజ్) కారణం అని తెలుసుకుంటాడు. అయితే ఒకే అమ్మాయి టెర్రరిస్ట్ గా , రక్తపిశాచి గా, గూఢచారిగా ఎలా మారింది? మరో వైపు కార్తీక్( చంద్రకాంత్) అక్క రాయ్ ఏమైంది? ఆమెకు వచ్చిన ప్రమాదం ఏంటి? ఆమె గతం ఏంటి? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: పూర్వాజ్ డాక్టర్‌గా కాసేపు, పోలీస్‌గా కాసేపు కనిపించి జనాలను కన్ఫ్యూజ్ చేశాడు. ఇతను చూడటానికి కొన్ని యాంగిల్స్‌లో పూరీ జగన్నాథ్‌ను తలపించాడు. కానీ చాలా చోట్ల అవుట్ ఆఫ్ ది బాక్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ను ఇరిటేట్ చేశాడు. సీరియల్ ఆర్టిస్ట్‌గా, తల్లి పాత్రతో ఫేమస్ అయిన జ్యోతి పూర్వాజ్, ఇందులో అక్క పాత్రలో బాగానే నటించింది. బహుశా ఆమెకు ఫ్యామిలీ ఇమేజ్ ఉండటం వల్ల కావచ్చు. ఆ పాత్ర బాగా సూట్ అయిన ఫీలింగ్ ఇస్తుంది. అయితే టెర్రరిస్ట్‌గా, గూఢచారిగా, రక్తపిశాచిగా ఆమె లుక్స్ సెట్ అవ్వలేదు.

క్లోజప్ షాట్స్‌లో ఆమె ఏజ్ కనిపించేస్తుంది. దానిని కవర్ చేసేందుకు ఓవర్ మేకప్ వేశారు కానీ, కవర్ అవ్వలేదు. చంద్రకాంత్ కొల్లు బాగానే నటించాడు. అయితే ఇతని పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించడంతో న్యాచురాలిటీ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. మరో సీరియల్ ఆర్టిస్ట్ అర్చన అనంత్ కూడా బాగానే నటించింది. ఇంకా చాలా మంది యూట్యూబ్ యాంకర్లు, పబ్లిక్ టాక్ బ్యాచ్ నటించారు కానీ.. వాళ్ళ పాత్రలు పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు పూర్వాజ్ ఈ సినిమాను కేవలం 25 రోజుల్లో తీశాడట. అందులోనూ రూ.5 కోట్ల బడ్జెట్‌తో కంప్లీట్ చేసినట్టు ప్రమోషన్లలో చెప్పుకొచ్చాడు. టీజర్, ట్రైలర్స్‌లోని విజువల్స్ చూస్తే.. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నట్టు అనిపించాయి. కానీ సినిమాలో ఆ ఫీల్ కలగలేదు. సినిమాటోగ్రఫీ తప్ప బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా వీక్‌గా ఉంది. పాటలు లేకపోవడం ఒక ప్లస్ పాయింట్. కథనం విషయానికి వస్తే.. కొన్ని కథలు పేపర్‌పై బాగుంటాయి. కానీ వాటిని తెరపై ఆవిష్కరించే ప్రయత్నంలో లోపాలు తలెత్తితే అవుట్‌పుట్ తేడా కొట్టేస్తుంది.

ఈ ‘కిల్లర్’ విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ హాఫ్‌లో మల్టీలేయర్స్‌తో ఆడియన్స్‌ను కన్ఫ్యూజ్ చేసి పడేశాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ గ్లామర్‌కు, తన ఇంటరాగేషన్ ఎపిసోడ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇవి రెండూ కూడా ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడతాయి. సౌండ్ మిక్సింగ్ కూడా తేడా కొట్టింది. కొందరి వాయిస్‌లు రీ-సౌండ్ వచ్చాయి, అలాగే లౌడ్‌నెస్ వంటివి డబ్బింగ్ సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండాఫ్ ట్విస్ట్ కనిపెట్టడం అనేది పెద్ద కష్టంగా ఏమీ అనిపించదు. కానీ ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే.. సెకండాఫ్ కొంచెం బెటర్. ఆ ట్విస్ట్ వెనుక ఉన్న బ్యాక్ స్టోరీని దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. సినిమా రన్‌టైమ్ కూడా తక్కువగా ఉండటం ఇంకో ప్లస్ పాయింట్.

విశ్లేషణ: ‘కిల్లర్’ ఫస్ట్ హాఫ్ అంతా ఒక డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ ఇస్తుంది. అయితే సెకండాఫ్ కొంతవరకు పర్వాలేదు.ఇలాంటి మేధావితనంతో కూడుకున్న సినిమాలని.. థియేటర్లలో అటెన్షన్‌తో ఆడియన్స్ చివరి వరకు ఓపిగ్గా కూర్చోబెట్టడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. ప్రీమియర్ షోలకు అంటే కోటి రూపాయల అటెన్షన్ ఉంటుంది కాబట్టి ఓకే..! కానీ రిలీజ్ రోజు నుంచి ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించే కెపాసిటీ అయితే ఈ సినిమాకు లేదు.

ఫోకస్: అటెంప్ట్ కొత్త.. టేకింగ్ పాత

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jyoti Poorvaj
  • #killer movie
  • #Poorvaaj

Reviews

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

trending news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

19 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

1 day ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago

latest news

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

16 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

18 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

19 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

20 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version