నవమన్మధుడి ‘నవరస’ సమ్మేళనం!!!

టాలీవుడ్ లెజెండ్స్ లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు గారి నట వారసుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసిన యువసామ్రాట్ నాగార్జున తొలి సినిమాతోనే ప్రయోగాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారారు అని చెప్పాలి. సినిమా…సినిమాకు సంభంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, 20లో యువసామ్రాట్ నుంచి 50+లో సైతం నవ మన్మధుడిగా టాలీవుడ్ రంగంలో ప్రభంజనం సృష్టిస్తున్నాడు మన డాన్. ‘డాన్’ గా డమరుకం మోగించినా…అన్నమయ్యగా ఆలాపనలు అందించినా…రగడ పేరుతో రచ్చ చేసినా…గ్రీకువీరుడుగా అందాల భామల మనసు దోచినా అది మన ‘బాస్’ అలియాస్ ‘మాస్’….అక్కినేని అందగాడికే చెల్లింది.

అందమైన రూపంతో పాటు, తెలుగు తెరపై అద్భుతమైన నటనతో పాటు… నిర్మాతగానూ, బుల్లి తెరపై యాంకర్ గాను సైతం నాగ్ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారాడు. మరి అలాంటి నవరసాల నవమన్మధుడు నాగ్ సినీ కరియర్ లో కొన్ని అద్భుతాలను ఒక్కసారి చూద్దాం రండి…

1.గీతాంజలి

టాలీవుడ్ చరిత్రలో ఎన్ని ప్రేమ కధలు తెరకెక్కినా, ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రం ఈ గీతాంజలి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెలుగులో తొలిసారి సంధించిన ‘ప్రేమ’ ఆయుధం అనేక ప్రభంజనాలకు శ్రీకారం చుట్టింది. ఇక ఈ చిత్రంలో క్లైమ్యాక్స్ సీన్ లో నాగ నటన చూసి కన్నీళ్ళు పెట్టని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకుల మన్నలనే కానీ, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న చిత్రం….

2.శివ

‘సైకిల్’ చైన్ ను చేతికి చుట్టుకుని విలన్స్ భరతం పట్టే హీరో పాత్రలో నాగ్ దుమ్ము దులిపేసాడు అంతే. అసలు కాలేజీ కుర్రాడిగా ఎంట్రెన్స్ ఇచ్చే నాగ్, చివరకు బెజవాడ గ్యాంగ్స్ ను ఫినిష్ చేసే డాన్ గా మారే సీన్స్ టాలీవుడ్ లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాయి. మాస్ హీరోగా నాగ్ కరియర్ కు ఈ సినిమా టైటల్ కార్డ్ గా నిలిచి పోతుంది. ఇక సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి…

3.జైత్ర యాత్రతానూ పుట్టి పెరిగిన ప్రాంతంలోని ప్రజలను పట్టి పీడిస్తూ  బలవంతంగా దొంగతనాలకు ఉసిగొల్పుతున్న విలన్స్ భరతం పట్టే నాయకుడిగా నాగార్జున నటన ఈ చిత్రంలో అద్భుతం…

4.కిల్లర్భర్తను కోల్పోయి కూతురుతో బ్రతుకున్న ముఖ్యమంత్రి కుటుంబాన్ని టార్గెట్ చేసి, కిల్లర్ పాత్రలో వాళ్ళని అంతం చేసేందుకు ప్రయత్నాలు చేసే కిల్లర్ గా నాగ్ నటించాడు. ఈ పాత్ర నాగ్ కరియర్ లోనే సరికొత్త పాత్రగా నిలిచింది…

5.అంతంఅనాధ రౌడీగా మారిన పాత్రలో నాగ్ నటన అప్పట్లో సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. రఫ్ లుక్ లో నాగ్ అదరగొట్టాడు…

6.గోవింద…గోవిందవెంకటేశ్వర స్వామి కిరీటాన్ని దొంగతనం చేసే బ్యాచ్ కు బుద్ది చెప్పే గైడ్ గా, హీరోయిన్ శ్రీదేవి ని కాపాడే ప్రయత్నంలో నాగ్ నటన అమోఘం, అద్భుతం అనే చెప్పాలి. ‘మతారాధన’ వ్యవస్థపై రామ్ గోపాల్ వర్మ సంధించిన పదునైన భాణం ఈ చిత్రం. ఇక ఈ చిత్రంలో నాగ్ అద్భుత నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు…

7.హలోబ్రదర్ఈ సినిమా ముందు వరకూ నాగ్ కు ఉన్న క్రేజ్ వేరు…ఈ సినిమా తరువాత నాగ్ కు వచ్చిన క్రేజ్ వేరు అంటే అతిశయోక్తి కాదు. ‘అట్టా..ఎర్రి మొహాలేసి సూత్తారేంట్రా…వాయించండే’ అనే డైలాగ్ ఇప్పటికీ ఎక్కడో అక్కడ మనవాళ్ళు వాడుతూనే ఉంటారు. టాలీవుడ్ లో డ్యూయెల్ పాత్రల్లో ఎంత మంది హీరోలు ఎన్ని సినిమాల్లో కనిపించినా ఈ సినిమా తరువాతే అంటే ఒప్పుకోక తప్పదు. అంతలా ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు మన కింగ్ నాగార్జున. ఇక ఈ సినిమాలో నాగ్ లో ఎంటర్‌టేన్‌మెంట్ యాంగిల్ కు సైతం ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు…

8.క్రిమినల్భార్య హత్య కేసులో అనుకోని పరిస్థితుల్లో ఒక నిందితునిగా మారిన డాక్టర్ పాత్రలో నాగ్ అద్భుతమైన నటనను కనబరిచాడు. తన నిర్దోశిత్వాన్ని న్యాయస్థానం ముందు నిరూపించేందుకు చేసే ప్రయత్నంలో నాగ్ నటనకి విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు…

9.నిన్నేపెళ్ళాడతాటాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో ఎన్నో కుటుంబకధా చిత్రాలకు ఆధ్యం పోసింది ఈ చిత్రం. ఈ చిత్రంలో ఒక పక్క ప్రేమికుడిగా, మరోపక్క కొడుకుగా, ఇంకో పక్క ఫ్యామిలీలో కీలక వ్యక్తిగా నాగ్ ఈ సినిమాలో నటించిన తీరు ప్రేక్షకులకే కాదు, విమర్శకులకు సైతం ప్రశంసలు కురిపించే అవకాశం కల్పించింది…

10.అన్నమయ్యరొమ్యాంటిక్ హీరోగా, మాస్ హీరోగా, క్లాస్ హీరోగా అప్పటి వరకూ ఒక ఊపు ఊపిన నాగ్, ఎంతో సాహసంతో, ఎంతో ధైర్యంతో, ప్రయోగాలకు తాను ఎప్పుడు ముందు ఉంటాను అని నిరూపించిన చిత్రం ‘అన్నమయ్య’. ఆధ్యాత్మిక పాత్ర అయిన అన్నమయ్యను నాగ్ ఎలా పోషించగలడు అన్న వాదనకు తన అద్భుతమైన నటనతో విమర్శకులకు సమాధానం చెప్పాడు నాగార్జున. ఇక ఎన్టీఆర్-ఏ.ఎన్.ఆర్ తరువాత మరచిపోయారు అనుకున్న ఆధ్యాత్మిక చిత్రాలను మరొక్కసారి ప్రేక్షకులకు రుచి చూపించాడు మన కింగ్.

11.ఆవిడ మా ఆవిడేఇద్దరి పెళ్ళాల ముద్దుల గోల మధ్య, అమాయకంగా, ఈ చిత్రంలో నాగ్ పాత్ర సంపూర్ణమైన ఎంటర్‌టేన్‌మెంట్ తో కలిగి ఉంటుంది. నాగ్ నవరసాల్లో హాస్యంతో కూడిన శృంగారరసం ఏ చిత్రం.

12.మన్మధుడుసహజంగా అందగాడు అయిన నాగ్ కు లేడీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే నాగ్ ను ఒక్కసారి డైరెక్ట్ గా చూస్తే చాలు అనుకునే వారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. నాగ్ తో ఒక్క ఫోటో దిగాలి, నాగ్ లాంటి అందగాడు తమకు జీవిత భాగస్వామి కావాలి అని కోరుకునే అమ్మాయిలు ఇప్పటికీ ఉన్నారు అంటే నమ్మకుండా ఉండలేం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగ్ పూర్తిగా అమ్మాయిలను వ్యతిరేకించే పాత్రలో నటించాడు. ఆడజాతి మొత్తం మోసపూరితమైనది అని అసహ్యించుకునే పాత్రలో నటించడం విశేషం. ఇక ఈ సినిమాలో నాగ్ వేసిన షార్ట్ కుర్తాలు, మన్మథుడు షర్ట్ లు గా క్రేజ్ ను సంపాదించుకున్నాయి.

13.నువ్వు వస్తావనిప్రేమించే వ్యక్తి ఎప్పటికప్పుడు తనని అనుకోని కారణవల్ల తనని అసహ్యంగా చూసుంటే, తన ప్రేమను తెలపాలనే ఆశతో, భాద్యతగల ప్రేమికుడిగా నాగ్ నటన అమోఘం. ఈ సినిమాలో పాటలు మంచి ప్రజాధరణ పొందాయి.

14.సూపర్టాలీవుడ్ చరిత్రలోలోనే మొట్ట మొదటిసారి అద్భుతమైన బైక్ రేస్ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘సూపర్’. ఈ చిత్రం విడుదలయిన సమయంలో దాదాపుగా బాలీవుడ్ ధూమ్ సినిమాను గుర్తుకు తెచ్చే విధంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో బైక్ రేస్, దొంగతనాన్ని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు పూరీ జగన్నాధ్. ఇక స్టైలిష్ కింగ్ నాగ్ ఈ సినిమాలో మరింత స్టైల్ గా కనిపించడంతో అభిమానులే కాదు, యావత్ ప్రేక్షకులు నాగ్ ను, నాగ్ స్టైల్ ను, నాగ్ బైక్ ను చూసి మురిసిపోయారు. ఇక ఈ చిత్రంతోనే నాగ్ “అనుష్క” అనే అందాల రాశిని టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయం చేశాడు.

15.శ్రీరామదాసు- షిరిడీసాయియాక్షన్ హీరోగా, రొమ్యాంటిక్ హీరోగా దుమ్ము దులుపుతున్న నాగ్, మరోసారి ప్రయోగాత్మక చిత్రాలుగా చేసిన ప్రయత్నమే శ్రీరామదాసు- షిరిడీసాయి. ఈ చిత్రాల్లో శ్రీరామదాసులో శ్రీరాముని భక్తునిగా, రామమందిరం కట్టించే క్రమంలో ఆయన పడ్డ ఇక్కట్లను ఎంత అందంగా తీర్చిదిద్దారో, అంతే అమోఘంగా నాగ్ నటన ప్రేక్షకులను మరొక్కసారి అన్నమయ్యని గుర్తు తెచ్చేలా చేసింది. ఇక షిరిడీసాయిలో సాక్షాత్తూ సాయినాధుని పాత్రలో నాగ్ నటన హ్యాట్సాఫ్ అనే చెప్పాలి.

16.గగనంకమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఏ సినిమా కూడా తెరకెక్కని ప్రస్తుత తెలుగు సినిమా చరిత్రలో పాట లేకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా, కేవలం కధపైనే ఆధారపడి తెరకెక్కింది ఈ చిత్రం. అంతటి మాస్ ఇమేజ్ ఉన్న నాగ్ ఇలాంటి చిత్రం చెయ్యడం నిజంగా సాహసం అనే చెప్పాలి. ఈ చిత్రం ప్రేక్షకుల మన్నలనె కాకుండా, విమర్శకుల ప్రశంసలు సైతం పొందడం విశేషం.

17.రాజన్ననేలకొండపల్లి ప్రజల కష్టాల నడుమ జరిగే ఒక పోరాటం “రాజన్న ” చిత్రం. ఈ చిత్రంలో పోరాట యోధుడిగా రాజన్న పాత్రలో నాగ్ మెప్పించాడు. ఇప్పటి కమర్షియల్ సినిమా రంగంలో ఈ తరహా సినిమా చెయ్యడం, తియ్యడం నిజంగా సాహసం అనే చెప్పాలి. ఈ క్రెడిట్ అంత నాగ చెందుతుంది. ఊహకు అందని విధంగా ఈ చిత్రానికి దాదాపుగా 6నంది ఆవార్డ్స్ రావడం విశేషం.

18.మనంఅక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన ఈ అరుదైన చిత్రం నాగ్ కు మాత్రమే కాదు, యావత్ ప్రేక్షకలోకానికి మరచిపోలేని జ్ఞాపకం. ఇక ఈ చిత్రంలో ఒక పెద్ద వ్యాపారవేత్తగానే కాకుండా,  బారిష్టర్ చదివిన సీతారాముడి పాత్రలో నాగ్ నటనకు బ్రహ్మరధం పట్టారు ప్రేక్షకులు. అయితే ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రమే స్వర్గీయ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి సినిమా కావడం అభిమానులు జీర్ణించుకోలేని విషయం

19. సోగ్గాడే చిన్ని నాయనఇప్పటివరకూ నాగ్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, సొగ్గాడే చిన్ని నాయనా సినిమా ఒక ఎత్తు అంటే అతిశయోక్తి కాదు…ఎందుకంటే కమర్షియల్ కధాంశాలతో ప్రస్తుత సినిమా ప్రపంచం నడుస్తుంటే…యముడి అనుమతితో ఆత్మ రూపంలో  భూలోకానికి వచ్చి, ఫ్రెండ్లీ ఘోస్ట్ గా భార్యకు మాత్రమే కనపడుతూ, వినపడుతూ కొడుకు కాపురం చక్కదిద్దడానికి ప్రయత్నించే పాత్రలు నాగ్ చెయ్యడం నిజంగా సాహసం అనే చెప్పాలి. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే నాగ్ తన టాలెంట్ తో మరోసారి ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాను అందించాడు. ఆత్మగా మారిన బంగార్రాజు పాత్రలో ఒక వేరియేషన్ తో, మరో పక్క అమాయకపు డాక్టర్ గా మరొక పాత్రలో నాగ్ జీవించాడు.

20.ఊపిరిసాహసం…ప్రయోగాత్మకం…తన శైలి అంటూ మరోసారి సరికొత్త పాత్రలో దర్శనం ఇచ్చాడు నాగ్. ఎవ్వరూ ఊహించని విధంగా, ఓ ప్రమాదం బారిన పడి పూర్తిగా కాళ్ళు, చేతులు పనిచేయకుండా వీల్ ఛైర్ కే అతుక్కుపోయిన కోటీశ్వరుడైన విక్రమ్ ఆదిత్య పాత్రలో నాగ్ జీవించాడు. ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించేందుకు ముందుండే నాగ్ తొలిసారి కరియర్ లో ఫుల్ టైమ్ వీల్ ఛైర్ పాత్రలో నటించి ప్రేక్షకులను తన నటనతో పడేశాడు.

ఇలా ట్రెండ్ కు పూర్తి వ్యతిరేకంగా, సరికొత్త ప్రయోగాలు చెయ్యడమే కాకుండా, వాటిని భారీ ప్రభంజనాలుగా మలచి, సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతూ వస్తున్నాడు నాగ్. మరి మన నవమన్మధుడు ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు మరిన్ని చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus