Kiran Abbavaram: సక్సెస్ ను క్యాష్ చేసుకుంటున్న అబ్బవరం.. ఇప్పుడు ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే?

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ను ప్రారంభించిన కిరణ్ అబ్బవరం  (Kiran Abbavaram).. ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ (SR Kalyanamandapam) తో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో అతనికి వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో వచ్చిన ‘సమ్మతమే’ (Sammathame) ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) వంటి సినిమాలు బాగానే ఆడినా, ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ (Nenu Meeku Baaga Kavalsinavaadini)  ‘మీటర్’ (Meter) ‘రూల్స్ రంజన్’ (Rules Ranjan) వంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

Kiran Abbavaram

దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని ‘క’  (KA)  సినిమా చేశాడు. అది మంచి విజయం సాధించింది. కిరణ్ అబ్బవరం రూ.50 కోట్ల క్లబ్ లో చేరాడు. త్వరలో ‘దిల్ రుబా’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దానికి మంచి బిజినెస్ జరుగుతుంది.వాస్తవానికి ‘క’ కంటే ముందు ‘దిల్ రుబా’ రావాలి. దాని షూటింగ్ ముందే కంప్లీట్ అయ్యింది. కాకపోతే ‘క’ సినిమా కంటెంట్ బాగా వచ్చింది అనే కాన్ఫిడెన్స్ తో.. ఆ సినిమాని ముందు రిలీజ్ చేశాడు. దాని వల్ల ఇప్పుడు ‘దిల్ రుబా’ కి హైప్ పెరిగింది.

ఇక ఇదే ఊపులో పారితోషికం కూడా పెంచేశాడట కిరణ్ అబ్బవరం. గతంతో పోలిస్తే ఇప్పుడు రూ.2 కోట్లు పెంచేశాడట. ‘క’ సినిమాకి ముందు వరకు రూ.3, రూ.4 కోట్లు పారితోషికం తీసుకునే కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు రూ.6 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.అంతేకాదు ప్రొడక్షన్ చాలా వరకు అతని టీం చూసుకుంటుందని చెప్పాడట. అందులో కూడా తన టీంని అడ్డం పెట్టుకుని మరింతగా వెనకేసుకోవచ్చు అనేది ఈ కుర్ర హీరో ప్లాన్ అని తెలుస్తుంది. ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు క్యాష్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి.. కిరణ్ కూడా అదే ఫాలో అవుతున్నట్టు స్పష్టమవుతుంది.

‘పుష్ప 2’ ..అక్కడ రెండో వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus