సినిమా మీద అంచనాలు ఉంటే వాటిని అందుకోవడం చాలా కష్టం. అయితే అంచనాలు లేని సినిమాతో అంచనాలకు మించిన విజయం అందించడం ఇంకా కష్టం. ఇది హీరోకు, దర్శకుడుకు.. ఇలా అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి విజయం సాధించి.. కంటెంట్ పవర్, కాస్టింగ్ పవర్ ఏంటి అనేది చూపించిన చిత్రం ‘డిసి’. లోకేశ్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో అరుణ్ మాథేశ్వరన్ రూపొందించిన చిత్రమిది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా మంచి వసూళ్లను అందుకుంటోంది.
ఇలాంటి సమయంలో సినిమాకు మరింత హైప్‌ని తీసుకొచ్చే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అదే ‘డిసి’ సినిమా టీమ్ మరోసారి కలవబోతోంది అని. అదేంటి ‘డిసి’ సినిమా ఆఖరులో ఎలాంటి సీక్వెల్ మాట చెప్పలేదు కదా అంటారా? అవును అక్కడేమీ చెప్పలేదు కానీ కోడంబాక్కం వర్గాల సమాచారం ప్రకారం చూస్తే.. ఈ టీమ్ మరోసారి కలుస్తోంది అని చెబుతున్నారు. అంటే ఆ సినిమా సీక్వెల్ లేదా ప్రీక్వెల్ అని కాకుండా ఈ సినిమా టీమ్ అంతా కలసి మరో సినిమా చేయబోతున్నారు అని తెలుస్తోంది.
అయితే, ఈ సినిమా ఇప్పటికిప్పుడు సెట్స్‌పైకి వెళ్లే పరిస్థితి లేదు అని చెప్పాలి. ఎందుకంటే ‘డిసి’ పనుల్లో ఇన్నాళ్లూ బిజీగా ఉన్న లోకేశ్.. ఇప్పుడు మొత్తం కాన్సన్‌ట్రేషన్ అల్లు అర్జున్ సినిమా మీద పెట్టబోతున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. అందుకే ఇప్పట్లో ‘డిసి’ కాంబో రిపీట్ కావడం కష్టమే. కానీ ఈ ఆప్షన్ అయితే ఉంది అని చెప్పొచ్చు. మరి ఈసారి చేయబోయే సినిమా ‘డిసి’ తరహాలో కొత్త ప్రయత్నమా.. లేక ఈసారి కొత్తగా ఆలోచిస్తారా అనేది చూడాలి.