Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) కాంబినేషన్లో ‘రాక్షసుడు’ తర్వాత రూపొందిన చిత్రం ‘కిష్కింధపురి'(Kishkindhapuri). ఇదొక హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి ఈ సినిమాకు దర్శకుడు. టీజర్, ట్రైలర్స్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు.సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి 2 రోజుల ముందు నుండే ప్రీమియర్స్ వేశారు.

Kishkindhapuri Collections

వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువల్ల బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది ‘కిష్కింధపురి’ (Kishkindhapuri) మొదటి రోజును మించి రెండో రోజు, రెండో రోజుని మించి మూడో రోజు ఈ సినిమా కలెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేస్తుంది.కానీ కొంచెం ప్రమోషన్ చేస్తే.. మరింతగా జనాలకు సినిమాని చేరువయ్యేలా చేసినట్టు అవుతుంది.పైగా 2వ వీకెండ్ కు సరైన సినిమా లేదు కాబట్టి.. ‘కిష్కింధపురి’ కి క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  3.13 cr
సీడెడ్  0.64 cr
ఆంధ్ర(టోటల్)  3.28 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)  7.05 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.40 cr
ఓవర్సీస్  0.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  7.95 cr (షేర్)

‘కిష్కింధపురి’ (Kishkindhapuri) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 రోజుల్లో ఈ సినిమాకి రూ.7.95 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా రూ.13.50 కోట్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.3.05 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ రావడం వల్ల ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ ‘మిరాయ్’ కి కూడా సూపర్ హిట్ టాక్ రావడం వల్ల ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్ పై కొంత ప్రభావం అయితే పడింది. అందువల్ల వీకెండ్ కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు.. కొంచెం సినిమాని ప్రమోట్ చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus