Mahesh Babu: మహేష్ బాబు నిర్మాతల హీరో.. రాజమౌళి 15 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలానే ఉన్నారు: నిర్మాత కే.ఎల్.నారాయణ

మహేష్ బాబు, రాజమౌళి..ల సినిమాకి ‘వారణాసి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు రామోజీ ఫిలింసిటీలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో టైటిల్ తో పాటు హీరో మహేష్ బాబు పాత్రను కూడా రివీల్ చేశారు. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత ‘శ్రీ దుర్గ ఆర్ట్స్’ అధినేత అయినటువంటి కే.ఎల్.నారాయణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కే.ఎల్.నారాయణ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం..! 15 ఏళ్ళ క్రితం మహేష్ బాబు గారితో.. ‘సార్.. మనం రాజమౌళి గారితో సినిమా చేద్దాం అండి’ అని అడిగాను.

Mahesh Babu

అందుకు ఆయన వెంటనే ఒప్పుకున్నారు. మహేష్ బాబు గారు కృష్ణ గారి లాగే నిర్మాతల హీరో. 15 ఏళ్ళ క్రితం మాటకి కట్టుబడి సినిమా చేస్తున్నారు.అయితే అప్పుడు ఆయన చాలా ప్రాజెక్టులతో కమిట్ అయ్యి ఉన్నారు. మరోపక్క రాజమౌళి గారు కూడా ఆయన ప్రాజెక్టులతో బిజీగా ఉండటం జరిగింది. ఇక ఈ 15 ఏళ్లలో రాజమౌళి గారు ఒక మర్యాదరామన్న, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి డిఫరెంట్ సబ్జెక్టులు చేసి టాలీవుడ్ రేంజ్ పెంచారు. ఆయన కూడా ఎవ్వరూ టచ్ చేయని రేంజ్ కు వెళ్లారు.

అయితే ఒకటి కచ్చితంగా చెప్పాలి.. 15 ఏళ్ళకి ముందు రాజమౌళి ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి బడా స్టార్స్ తో పనిచేయడం ఆనందంగా ఉంది. ఎం.ఎం.కీరవాణి గారితో ‘క్షణ క్షణం’ కి పనిచేశాం. ఆస్కార్ గెలిచాక ఇన్నేళ్లకు ఆయనతో మళ్ళీ పనిచేయడం ఆనందంగా ఉంది.

అయితే ఈ సినిమాని త్వరగా కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకురావాలని రాజమౌళి గారి మీ తరఫున కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. కాగా కే.ఎల్.నారాయణ్ గతంలో ‘హలో బ్రదర్’ ‘సంతోషం’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు మనకి అందించారు అనే సంగతి ఇప్పటి యువతకి తెలియకపోవచ్చు.

రాజమౌళి- మహేష్..ల ‘వారణాసి’ వెనుక ప్రభాస్ హస్తం.. ఆసక్తికర విషయం చెప్పుకొచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus