దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రూపొందుతున్న గ్లోబ్ ట్రోటర్ మూవీ ‘వారణాసి’. ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ఈరోజు రామోజీ ఫిలింసిటీలో ఘనంగా జరిగింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్ర పోషిస్తున్నాడు. అత్యంత క్రూరమైన విలన్ పాత్ర అది అని ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. ఇక ‘వారాణసి’ టైటిల్ లాంచ్ కి విచ్చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇంట్రెస్టింగ్ స్పీచ్ ఇచ్చాడు.
ఈ కథ వినడానికి ప్రభాస్ కూడా ఓ కారణం అన్నట్టు అతను చెప్పి ఆశ్చర్యపరిచాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. “25 ఏళ్లలో ఎన్నో సినిమాలు చేశాను.. కానీ ఇంతమంది లెజెండ్స్ తో ఈ సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా పాత్రని పరిచయం చేసినందుకు కీరవాణి గారికి చాలా థాంక్స్. 2 ఏళ్ళ క్రితం నా డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నప్పుడు రాజమౌళి నుండి ఓ మెసేజ్ వచ్చింది. ‘హాయ్ పృథ్వీ నా సినిమాల్లో ఓ స్ట్రాంగ్ విలన్ రోల్ ఉంది.
అది నీకు కరెక్ట్ గా సూట్ అవుతుంది అని భావించాను’ అని చెప్పారు. తర్వాత నా ఫ్రెండ్ ప్రభాస్.. చాలా బాగుంటుంది విను అని చెప్పారు. తర్వాత వెళ్లి రాజమౌళి గారిని కలిశాను. 5 నిమిషాల్లో ఆయన నెరేషన్ కి ఫ్లాట్ అయిపోయాను. నేను తెలుగులో చూసిన మొదటి సినిమా ‘పోకిరి’. మహేష్ బాబు సూపర్ స్టార్ అనే బిరుదుకి అర్హుడు. అలాగే ఈ కథ(గ్లోబ్ ట్రోటర్) కి నీలాంటి సూపర్ స్టార్ అవసరం” అంటూ చెప్పుకొచ్చాడు. సో పృథ్వీరాజ్ మహేష్- రాజమౌళి..ల ‘వారణాసి’ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇవ్వడం వెనుక ప్రభాస్ హస్తం కూడా ఉందన్న మాట.