సీనియర్ నిర్మాత మృతి

Advertisement

కోలీవుడ్ సీనియర్ నిర్మాత, దర్శకుడు మరియు నటుడు అయినటువంటి కె.రాజన్(K Rajan) మృతిచెందారు. ఈరోజు చెన్నైలో ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది.

K Rajan

ఆయన వయసు 85 ఏళ్ళు. అడయార్ వంతెనపై నుండి నదిలోకి దూకి ఆయన బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. స్థానికుల నుండి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది నది నుండి ఆయన మృతదేహాన్ని వెలికితీశారు.

వృద్ధాప్య సమస్యలు, ఒంటరితనం మరియు వ్యక్తిగత ఒత్తిడి కారణంగానే ఆయన ఈ ఘోరానికి పాల్పడినట్టు పోలీసులు అభిప్రాయపడుతున్నారు.రాజన్ మృతిపై కేసు నమోదు చేయడమే కాకుండా దర్యాప్తు కూడా మొదలుపెట్టినట్టు స్పష్టమవుతుంది.కె.రాజన్ సినీ ప్రస్థానాన్ని గమనిస్తే… 1983లో వచ్చిన ‘బ్రహ్మచారిగల్’ చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘డబుల్స్’ ‘అవళ్ పావమ్’ వంటి చిత్రాలను నిర్మించారు.

దర్శకుడిగా కూడా మారి ‘నమ్మ ఊరు మరియమ్మ’ ‘ఉనర్చిగల్’ వంటి సినిమాలను తెరకెక్కించారు. తర్వాత నటుడిగా కూడా మారి ‘మైఖేల్ రాజ్’ ‘తునివు'(తెగింపు తెలుగులో) వంటి సినిమాల్లో నటించారు. నటుడిగా రాజన్ దాదాపు 18 సినిమాల్లో నటించినట్టు అంచనా.కె.రాజన్‌ ముక్కుసూటి మనిషి. హీరోల రెమ్యునరేషన్లు, ఇండస్ట్రీ రాజకీయాల గురించి ఆయన కూడబద్దలుకొట్టినట్టు మాట్లాడేవారు.ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యేవి.

కొంతమంది ఆయన్ని వ్యతిరేకించేవారు.. అయితే చాలా మంది మద్దతు పలికేవారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. రాజన్ మృతికి చింతిస్తూ హీరో విశాల్, నటి ఖుష్బూ సుందర్, శరత్‌కుమార్ వంటి నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus