Koratala Siva: కొరటాల దగ్గర అసలు కథే లేదా..?

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ తో ఉంటుందని అన్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చింది. కానీ ఈ ప్రాజెక్ట్ వాయిదా పడడంతో మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రంగంలోకి దిగారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇదంతా కూడా చాలా సడెన్ గా జరిగింది. నిజానికి కొరటాల దగ్గర ఎన్టీఆర్ కి సరిపడా కథ కూడా సిద్ధంగా లేదట. ‘ఆచార్య’ సినిమా పూర్తయిన తరువాత కొరటాల.. బన్నీతో సినిమా చేయాలనుకున్నారు.

దానికి సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఎన్టీఆర్ కోసం కథ అల్లుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బేసిక్ గా కొరటాల రైటర్ కాబట్టి ఆయన దగ్గర లైన్స్ కు కొదవ లేదు. తన దగ్గర ఎప్పుడూ పది కథలు సిద్ధంగా ఉంటాయని కొరటాల చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇప్పుడు వాటిలో ఎన్టీఆర్ కు సరిపడే కథను ఎంపిక చేసి సినిమా తీయాలి. మహేష్ బాబు, ప్రభాస్ ల కోసం కొరటాల కొన్ని లైన్లు సిద్ధం చేసుకున్నారు.

వాటిలో ఒకదాన్ని ఎన్టీఆర్ కి సూటయ్యేలా మార్చుకోవాలి. కొరటాలకు ఇదేమంత కష్టమైన విషయం కాదు. ఈ నమ్మకంతోనే ఎన్టీఆర్ కథ లేకపోయినా.. కొరటాలతో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఇప్పటివరకు కొరటాల కెరీర్ లో ప్లాప్ అనేదే లేదు. అందుకే హీరోలు అతడితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం కొరటాల డైరెక్ట్ చేస్తోన్న ‘ఆచార్య’ షూటింగ్ దశలో ఉంది. మేలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది!

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus