Koushal: ఆ సినిమాలో నటించి తప్పు చేశానన్న కౌశల్!

  • February 12, 2022 / 07:49 PM IST

సినిమా ఇండస్ట్రీలో వరుసగా విజయాలను అందుకుంటే మాత్రమే కెరీర్ విషయంలో సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్2 తెలుగు విన్నర్ కౌశల్ అనే సంగతి తెలిసిందే. తన టాలెంట్ తో కౌశల్ ఆ షోకు విజేతగా నిలిచారు. గీతామాధురి, మరి కొందరు కంటెస్టెంట్ల నుంచి కౌశల్ కు గట్టి పోటీ ఎదురైనా కౌశల్ మాత్రం అభిమానుల హృదయాలను గెలుచుకుని అనుకున్నది సాధించారు.

Click Here To Watch

బిగ్ బాస్ సీజన్2 తర్వాత కౌశల్ వరుస సినిమాలతో బిజీ అవుతారని అభిమానులు భావించినా కౌశల్ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించలేదు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కౌశల్ ఆ ఇంటర్వ్యూలో కొన్ని సినిమాలకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో తనకు ఆఫర్లు రాలేదని మరికొన్ని సినిమాలు స్టోరీ నచ్చకపోవడంతో తాను రిజెక్ట్ చేశానని వెల్లడించారు. ఇప్పటివరకు 86 సినిమాలలో నటించినా ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు తనకు గుర్తింపును తెచ్చిపెట్టలేదని కౌశల్ వెల్లడించారు.

దర్శకనిర్మాతలను తనకు సినిమాలలో ఛాన్స్ ఇవ్వాలని అడగనని సినిమాలో ఛాన్స్ ఉందని చెబితే మాత్రమే నటిస్తానని కౌశల్ తెలిపారు. సినిమా ఆఫర్ల కొరకు కొంతమంది వెళ్లి అడుక్కుంటారని అది నా స్టైల్ కాదని కౌశల్ కామెంట్లు చేశారు. తనకు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఉందని కౌశల్ వెల్లడించారు. ఆ ప్రొడక్షన్ హౌస్ లో ప్రతిరోజూ యాడ్స్, షూట్స్, ఫ్యాషన్ షోస్ జరుగుతాయని కౌశల్ చెప్పుకొచ్చారు. తాను నటించిన ఒక సినిమా వల్ల అడల్ట్ మూవీస్ చేస్తానని ముద్ర పడిందని ఆ సినిమా తన కెరీర్ ను నాశనం చేసిందని కౌశల్ తెలిపారు.

ఆ సినిమా కోసం తాను 50,000 రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నానని కౌశల్ చెప్పుకొచ్చారు. డబ్బు అవసరం కావడంతో తాను ఆ సినిమాలో నటించానని కౌశల్ వెల్లడించారు. కౌశల్ నటించిన సినిమా పేరు స్వర్ణ కాగా ఈ సినిమాలో కౌశల్ నెగిటివ్ రోల్ లో నటించారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus