‘రెడ్’, ‘క్రాక్’.. రిలీజ్ కి రెడీ!

బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్స్ రావాలంటే సినిమాలను పండగ సమయంలో విడుదల చేయడమనేది నిర్మాతలకు మంచి ఆప్షన్. కానీ ఈసారి కరోనా వలన దసరాకు ఎలాంటి సందడి లేకుండా పోయింది. అయితే సంక్రాంతిని మాత్రం మిస్ చేసుకోవాలనుకోవడం లేదు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమా సంక్రాంతికి వస్తుందని సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా ఇదే రేసులో హీరో రామ్ ‘రెడ్’ సినిమా, రవితేజ ‘క్రాక్’ సినిమాలు నిలిచాయి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ‘రెడ్’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.

ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఫైనల్ గా సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యారు. చాలా ఏళ్ల తరువాత రామ్ నటిస్తోన్న సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుండడం విశేషం. ఈ సినిమాలో మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌, నివేదా పేతురాజ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక రవితేజ ‘క్రాక్’ సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ కి రెడీ అయింది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న

ఈ సినిమాను యదార్ధ సంఘటనల ఆధారంగా తెరెక్కిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే సముద్రఖని, వరలక్ష్మీశరత్‌కుమార్ లాంటి వాళ్లు కీలకపాత్ర పోషిస్తున్నారు.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus